Begin typing your search above and press return to search.

రెండేళ్లు నిద్ర‌పోనివ్వ‌న‌ని MAA అధ్య‌క్షుడికి మోనార్క్ వార్నింగ్

By:  Tupaki Desk   |   18 Oct 2021 5:09 AM GMT
రెండేళ్లు నిద్ర‌పోనివ్వ‌న‌ని MAA అధ్య‌క్షుడికి మోనార్క్ వార్నింగ్
X
ఎలాంటి పాత్ర‌లో అయినా త‌న ప‌ర్ ఫెక్ష‌న్ ని చూపించి ఆ పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేయ‌డంతో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌ది ప్ర‌త్యేక శైలి. అలా చేసిన పాత్ర‌ల‌తో జాతీయ స్థాయిలో ప‌లు అవార్డుల్ని సొంతం చేసుకున్నారాయ‌న‌. ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు బాలీవుడ్ లోనూ త‌న‌దైన ముద్ర వేసిన ప్ర‌కాష్ రాజ్ ఇటీవ‌ల `మా` ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు విజ‌యం సాధించారు. అయితే ఈ ఎన్నిక‌ల అప్ర‌జాస్వామిక‌మ‌ని అంటున్నారాయ‌న‌.

ఓ మీడియా హౌస్ కిచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ప‌లు సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించారు ప్ర‌కాష్ రాజ్. త‌న‌కు 280 ఓట్లు వ‌చ్చాయ‌ని అయితే త‌న‌కు రావాల్సిన 380 ఓట్ల‌ని మంచు విష్ణు వ‌ర్గం లాక్కుంద‌ని.. పోల్ మేనేజ్ మెంట్ చేశార‌ని.. తాను గుద్దించుకుని సంపాదించుకున్న ఓట్ల‌తో గెల‌వ‌లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 1981లో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన న‌న్ను ప‌రాయివాడ‌న్నార‌ని.. 900 మంది స‌భ్యుల్లో 150 మంది ఇన్ యాక్టీవ్ గా వున్నార‌ని.. జెనీలియా లాంటి వాళ్ల‌ని ఫ్లైట్ వేసి మ‌రీ ర‌ప్పించార‌ని.. కొంత మందికి ఇంటికెళ్లి మ‌రీ చీర‌లు పంచార‌ని ఓపెన్ గానే కామెంట్ చేశారు ప్ర‌కాష్‌రాజ్‌.

ఎన్నిక‌ల ఆఫీస‌ర్ వుండగానే ముర‌ళీమోహ‌న్ వంటి పెద్ద‌ల ముందే మా స‌భ్యుల్ని బెదిరించి కొట్టార‌ని ఇదేనా పెద్ద‌రికం అంటే అని ప్ర‌కాష్ రాజ్ నిల‌దీశారు. కుటుంబం కుటుంబం అనే వారిని న‌మ్మ‌కూడ‌ద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అలాంటి వాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా వుండాల‌న్నారు. మార్పు రాక‌పోతే మ‌రో `మా` వ‌స్తుంద‌న్నారు. గొడ‌వ‌లు ప‌డుతూ మ‌న‌మంతా ఒకే కుటుంబం అంటున్నారు. కానీ నేను అది నాన్సెన్స్ అంటున్నాను. `మా` స‌మ‌రంలో నేను పావుని అయిపోయాన‌ని అనుకుంటున్నారు. కానీ నేను కాదంటున్నాను క‌దా? అన్నారు.

పెద్ద‌రికాల‌ని ప్ర‌శ్నిస్తున్నాను. ఎటు వెళ్లినా వీడు డేంజ‌రే అనేలా చేస్తున్నాను. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి కూడా ఆర్టిస్టులు రావాలని మంచు విష్ణు అంటున్నాడు.. ఈ రెండేళ్లు ప‌డుకోనివ్వ‌ను.. ప్ర‌శ్నిస్తూనే వుంటాను. ప్ర‌తీవారం రిపోర్ట్ కార్డ్ అడుగుతాను. ప‌ని నువ్వు చేస్తావా? న‌న్ను చేయ‌మంటావా? అని నిల‌దీస్తాను. ఎవ్వ‌రినీ ప్ర‌శాంతంగా వుండ‌నివ్వ‌ను.. మ‌నుషులు మారాలి... `మా `మారాలి `అని ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సీసీసీ ఫుటేజ్ డ్రామా ఎండ్ అయిన‌ట్టేనా?

మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నిక‌లు పూర్త‌యి మంచు విష్ణు అధ్యక్షుడిగా ఖ‌రారైనా ఆ త‌ర్వాత మెలోడ్రామా గురించి సంగ‌తి తెలిసిందే. ఇరు ప్యానెల్ లో గెలిచిన వారి వివ‌రాలు ఇప్ప‌టికే వెల్ల‌డ‌య్యాయి. ఎన్నిక‌లు ముగిసినా ఇంకా ప‌ట్టు విడుపు లేదు అంటూ ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం పోరు సాగిస్తోంది. ఎల‌క్ష‌న్ అనంత‌రం ర‌క‌ర‌కాల ట్విస్టులు తెలిసిందే. ముఖ్యంగా మోహ‌న్ బాబు వ‌ర్గం రౌడీయిజానికి పాల్ప‌డ్డార‌ని దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం ఆరోపించింది. విష్ణు- మ‌నోజ్ హుందాగా వ్య‌వ‌హ‌రించినా పెద్దాయ‌న వ్య‌వ‌హారంపై సినిమా బిడ్డ‌లం ప్యానెల్ గుర్రుమీదుంది.

ఇక‌పోతే ఎన్నిక‌ల రోజు సీసీ ఫుటేజ్ ని త‌మ‌కు ఇవ్వాల‌ని ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం కోర‌గా.. ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ (తెలంగాణ హైకోర్ట్ న్యాయ‌వాది) అందుకు నిరాక‌రించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇది కోర్టుల ప‌రిధిలో అంశం. కోర్టు ద్వారా మాత్ర‌మే ఇవ్వ‌గ‌లం అని జూబ్లీ పోలీస్ స్టేష‌న్ కి పంచాయితీని బ‌ద‌లాయించారు. ఆయ‌న భీష్మించ‌డంతో సీసీ ఫుటేజ్ ఉన్న గ‌దికి తాళం వేసి ప్ర‌స్తుతం అక్క‌డ పోలీసులు ప‌హారా కాస్తున్నారు. దీంతో ఈ విష‌యాన్ని కోర్టు వ‌ర‌కూ తీసుకెళ్లేందుకు ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. తాజా ప‌రిణామాల‌తో సీసీ ఫుటేజ్ లో ఏం ఉంది? అన్న క్యూరియాసిటీ మొద‌లైంది. అయిపోయిన పెళ్లికి బ్యాండ్ మేళం అన్న చందంగా మా ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో ట్విస్టులు ఇంకా ఇంకా వేడెక్కిస్తూనే ఉన్నాయి.

మా ఎన్నిక‌లు జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ లో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సీసీ ఫుటేజ్ ఆ స్కూల్ గ‌దిలోనే ఉంది. దీనికి ఇప్పుడు హైసెక్యూరిటీ అవ‌స‌ర‌మైంది. కోర్టు డైరెక్ష‌న్ లోనే సీసీ ఫుటేజ్ ని ఇస్తామ‌ని అంటున్నారు కాబ‌ట్టి ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం ఏం ఆలోచిస్తుంద‌న్న‌ది కాస్త ఆగితే కానీ తేల‌దు. ఇక ఈ ఎన్నిక‌ల్లో గొప్ప మెజారిటీ తో గెలుపొందింద‌ని మొద‌టిరోజు ప్ర‌క‌టించినా యాంక‌ర్ అన‌సూయను మ‌ళ్లీ ఓడిపోయింది అంటూ ఎన్నిక‌ల అధికారులు ఆ మ‌రుస‌టి రోజు ప్ర‌క‌టించారు. దీనిపై సినిమా బిడ్డ‌లం ప్యానెల్ సందేహాలు వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం సీసీ ఫుటేజ్ డ్రామా కంటిన్యూ అవుతోంది. ఎప్ప‌టికి ఫుల్ స్టాప్ ప‌డుతుందో చూడాలి.