Begin typing your search above and press return to search.
హీరో విక్రమ్ మీద తీవ్ర ఆరోపణలు
By: Tupaki Desk | 23 Aug 2016 4:21 AM GMTహీరో విక్రమ్ చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపిస్తాడు. వినమ్రంగా ఉంటాడు. చాలా పద్ధతిగా ప్రవర్తిస్తాడు. ఇన్నేళ్ల కెరీర్లో అతడి గురించి ఏ వివాదం లేదు. ఎవరూ అతడి మీద విమర్శలు చేసింది లేదు. అతడి కమిట్మెంట్ గురించి.. సింప్లిసిటీ గురించి ఎప్పుడూ పాజిటివ్ మాటలు వినడమే తప్ప.. విమర్శలు ఎన్నడూ రాలేదు. ఐతే అమెరికాకు చెందిన ఓ తమిళ సంఘం అధ్యక్షుడైన ప్రకాష్ స్వామి మాత్రం విక్రమ్ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. విక్రమ్ ఇగోయిస్ట్ అని.. పొగరుబోతని.. అభిమానులతో నీచంగా ప్రవర్తించాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇంతకీ మేటర్ ఏంటంటే..
ప్రతి ఏడాది భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికాలో వేడుకలు నిర్వహించే తమిళ సంఘం ఇండియా నుంచి కొందరు సెలబ్రెటీల్ని రప్పిస్తుంది. ఈసారి అందులో భాగంగా విక్రమ్ తో పాటు అభిషేక్ బచ్చన్.. మరికొందరిని ఆహ్వానించారట. ఐతే తాము అంత ఖర్చు పెట్టి విక్రమ్ ను అమెరికాకు రప్పిస్తే.. అతను ఇక్కడి అభిమానులెవర్నీ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటూ.. మెసేజెస్ చూసుకుంటూ.. ఇంకా ఏదేదో చేసుకుంటూ గడిపాడని అంటున్నాడు స్వామి. అభిషేక్ చాలా ఒద్దికగా ఉంటూ అభిమానుల్ని పలకరించాడని.. వారితో ఫొటోలు దిగాడని.. కానీ విక్రమ్ మాత్రం అభిమానుల్ని దగ్గరికే రానివ్వలేదని స్వామి ఆరోపించాడు. ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటని.. విక్రమ్ నుంచి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదని స్వామి అన్నాడు. ఇంతకుముందు శరత్ కుమార్.. రాధిక.. రెహమాన్ లాంటి వాళ్లు వచ్చి చాలా పద్ధతిగా ఉన్నారని.. ఓపిగ్గా వందలాది మంది అభిమానుల్ని కలిసి వారితో ఫొటోలు దిగారని.. కరచాలనాలు చేశారని.. కానీ విక్రమ్ తన చుట్టూ చేరిన 40-50 మందితో కూడా సరిగా వ్యవహరించలేదని అన్నాడు. విక్రమ్ తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడని.. అతను ఇండియన్ సినిమాకే కళంకమని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు స్వామి. మరి ఈ విమర్శలపై విక్రమ్ ఏమంటాడో చూడాలి.