Begin typing your search above and press return to search.

ప్ర‌కాష్ రాజ్ లో ఈ కోణం కూడానా?

By:  Tupaki Desk   |   15 March 2020 1:57 PM GMT
ప్ర‌కాష్ రాజ్ లో ఈ కోణం కూడానా?
X
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ లోని ర‌క‌ర‌కాల కోణాల గురించి ప్ర‌తిసారీ చ‌ర్చ‌కొస్తూనే ఉంది. ఆయ‌న‌లోని యారొగెన్సీ .. క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం గురించి .. కోప్ప‌డే స్వ‌భావం గురించి మీడియా హైలైట్ చేసింది. ఒక‌ర‌కంగా ఈ ముక్కుసూటి మ‌నిషిపై ఎక్కువ‌గా నెగెటివ్ ప్రొప‌గండా సాగించింది.

ఇక నిరంత‌రం రాజ‌కీయ‌ప‌ర‌మైన కామెంట్లు చేస్తూ అటు ఆ రంగంలోనూ శ‌త్రువుల్ని త‌యారు చేసుకున్నాడు. దీనివ‌ల్ల అత‌డు ర‌క‌ర‌కాల త‌లనొప్పుల్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇక ప‌దిమందికి సాయం చేయ‌డంలో ప్ర‌కాష్ రాజ్ ధాతృత్వం గురించి తెలిసింది త‌క్కువే. అత‌డి లోగుట్టు ఒక‌టి సీనియ‌ర్ న‌టుడు రాజా ర‌వీంద్ర తాజాగా బ‌య‌ట పెట్టారు.

ఓ ప్ర‌ముఖ‌ సీనియ‌ర్ న‌టుడు ఏకంగా 50ల‌క్ష‌లు అప్పు చేసి తిరిగి చెల్లించ‌లేని ధీన స్థితిలో ప‌డిపోయాడ‌ట‌. దాంతో ఆ న‌టుడిని పిలిపించుకుని ఆ అప్పు మొత్తం ప్ర‌కాష్ రాజ్ చెల్లించాడ‌ట‌. ఈ వ్య‌వ‌హారం త‌న‌కు తెలుసున‌ని రాజా ర‌వీంద్ర పొగిడేశారు. అంతా బాగానే ఉంది కానీ అప్పు చెల్లించేశాక‌.. ఆ త‌ర్వాత తిరిగి ప్ర‌కాష్ రాజ్ దానిని రిక‌వ‌రీ చేసుకోలేదా? ఒక్క రూపాయి అయినా ఆ పెద్ద మ‌నిషి నుంచి వెన‌క్కి అడ‌గ‌లేదా? అన్న సందేహం అంద‌రిలో క‌లుగుతోంది. ఇక ప్ర‌కాష్ రాజ్ తాను సంపాదించిన‌దంతా దాచుకుంటే వంద‌ల ఎక‌రాలు కొనేసేంత అయ్యేది అని కానీ అత‌డు ఏనాడూ దానిని దాచుకోలేద‌ని కూడా చెబుతుంటారు. మ‌రి ఇండ‌స్ట్రీలో క‌ష్టంలో ఉన్న‌వారిని ఆయ‌న ఆదుకునే త‌త్వం వ‌ల్ల‌నే ఇలా అయ్యిందా? అన్న‌ది తెలియాల్సి ఉంది.