Begin typing your search above and press return to search.
'ప్రణవాలయ' పాటతో మంత్రముగ్దులను చేస్తున్న సాయి పల్లవి..!
By: Tupaki Desk | 18 Dec 2021 2:17 PM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
ఇప్పటికే 'శ్యామ్ సింగరాయ్' నుంచి వచ్చిన పోస్టర్స్ - టీజర్ - ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ఈ వైవిధ్యమైన చిత్రానికి ఆకట్టుకునే మ్యూజిక్ అందించారు. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. ఈ క్రమంలో తాజాగా 'ప్రణవాలయ' అనే నాల్గవ పాటను రిలీజ్ చేశారు.
'ప్రణవాలయ పాహి.. పరిపాలయల పరమేసి.. కమలాయల శ్రీదేవి.. కురిపించవే కారుణాంభురాశి..' అంటూ సాగిన ఈ క్లాసికల్ సాంగ్ ప్రేక్షకులకు మంత్రముగ్దులను చేస్తోంది. ఇందులో సాయి పల్లవి యొక్క అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ - ఆహ్లాదకరమైన హావభావాలు చూడొచ్చు. స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయి పల్లవి.. ఆకర్షణీయమైన కదలికలతో మెస్మరైజ్ చేసింది.
దేవదాసి పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి స్టేజి మీద 'ప్రణవాలయ' పాటకు పెర్ఫార్మ్ చేస్తుండగా.. శ్యామ్ సింగరాయ్ పాత్రలో నటిస్తున్న నాని దాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. మిక్కీ స్వరపరిచిన ఈ గీతానికి.. లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి డివోషనల్ సాహిత్యాన్ని అందించారు. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఉత్సాహంగా పాడారు. ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్ కొరియోగ్రఫీ చేశారు.
'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇది నాని కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ. ఇందులో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ రవీంద్రన్ - మురళీ శర్మ - అభినవ్ గోమటం - జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషించారు.
సాను జాన్ వర్గేష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో డిసెంబర్ 24న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.