Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కుందనపు బొమ్మ
By: Tupaki Desk | 1 Sept 2017 10:20 AM ISTకన్నడ సీమ నుంచి టాలీవుడ్ కు వచ్చినా అచ్చ తెలుగు అందంగా గుర్తింపు తెచ్చుకుంది వాలుచూపుల వయ్యారి ప్రణీత సుభాష్. తీరైన కళ్లు.. చూడచక్కని మోము.. అందమైన పలువరసతో ఆకట్టుకునే రూపంతో ఉండే ఈ భామకు తెలుగులో మంచి ఛాన్సులే వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చేసిన అత్తారింటికి దారేది సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినా అందరి గుండెల్ని కొల్లగొట్టేసింది.
ఈమధ్య ప్రణీత సినిమాల్లో కన్నా ఈవెంట్లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. రీసెంట్ గా డెట్రాయిట్ టూర్ కు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్బంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ట్రెడిషనల్ వేర్ లో ఫొటోలకు ఫొజులిచ్చింది. మెరూన్ కలర్ మెరిసిపోతూ ముగ్ధమోహన సౌందర్యం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. అందుకేనేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అత్తారింటికి దారేదిలో ప్రణీతకు బాపుగారి బొమ్మ అని బిరుదిచ్చేశాడు. ఈ మధ్య కాలంలో ప్రణీత చాలా ఫంక్షన్లలో కనిపించినా ఇంత అందమైన లుక్ తో కనిపించలేదు. ఇవి చూస్తే హోమ్లీ గర్ల్ క్యారెక్టర్ కావాలంటే కచ్చితంగా ప్రణీతనే ఎంపిక చేస్తారంటే అతిశయోక్తి ఏం కాదు.
బ్రహ్మోత్సవం తర్వాత తెలుగులో అవకాశాలేవీ లేకపోవడంతో ప్రణీత తిరిగి శాండల్ వుడ్ కు రిటర్న్ అయిపోయింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో కలిసి నటించిన మాస్ లీడర్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. దీంతోపాటు ఈ ఏడాది మళయాళ సీమ నుంచి ఈ భామకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ ఏడాది ఆమె ఆ భాషలో మూడు సినిమాల్లో నటిస్తుండటం విశేషం.