Begin typing your search above and press return to search.

తార‌క్ ని ల‌క్ష్మీ ప్ర‌ణ‌తీ అలా ఆట ప‌ట్టిస్తుందా?

By:  Tupaki Desk   |   2 Aug 2022 3:30 PM GMT
తార‌క్ ని ల‌క్ష్మీ ప్ర‌ణ‌తీ అలా ఆట ప‌ట్టిస్తుందా?
X
స్టార్ హీరోల సినిమా షూటింగ్ లకు సాధార‌ణంగా శ‌ని-ఆదివారాలు హాలీడేస్ ఉంటాయి. దీంతో రోజంతా హీరోలు ఇంట్లో కుటుంబంతోనే స‌మ‌యాన్ని గ‌డుపుతుంటారు. హైద‌రాబాద్లో ఉంటే ఎలాగూ బ‌య‌ట విహ‌రించ‌లేని పరిస్థితి ఉంటుంది. కాబ‌ట్టి ఇంటికే ప‌రిమిత‌వ్వాలి. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ అయితే పిల్ల‌ల‌తోనే స‌మ‌యాన్ని గ‌డుపుతారు.

ఎక్కువ‌గా సితార‌తో క‌లిసి ఆడుకుంటారు. అలాగే బ‌న్నీ కూడా పిల్ల‌ల‌తోనే రాత్రి వ‌ర‌కూ స‌మ‌యాన్ని గ‌డుపుతాడు. ఇక రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న‌తో క‌బుర్లు చెప్పి కాల‌క్షేపం చేస్తుంటాడు. ప్ర‌భాస్ అయితే త‌న‌కిష్ట‌మైన డాగ్స్ తో స‌మ‌యాన్ని గ‌డుపుతాడు. మ‌రి తార‌క్ ఏం చేస్తాడు? అంటే వీళ్లింద‌రికీ భిన్నం అని తెలుస్తోంది.

తార‌క్ సండే వ‌చ్చిందంటే ఉదాయ‌న్నే కిచెన్ లోకి దూరిపోతాడుట‌. అలా తార‌క్ కిచెన్ లోకి వెళ్తే మిగ‌తా వంట మాష్ట‌ర్లు అంద‌రికీ ఆ రోజు సెల‌వు దొరికిన‌ట్లే నంట. అవును ఈ విష‌యాన్ని క‌ళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ప్ర‌తీ ఆదివారం అన్న‌య్య ఎక్క‌డున్నావ్? మ‌ధ్నాహ్నం లంచ్ కి వ‌చ్చేయ్ బిరియానీ రెడీ చేస్తాను అంటాడుట‌.

నాన్న బిరియానీ వ‌ద్దు బోర్ కొట్టిదంటే నాన్ వెజ్ లో డిఫ‌రెంట్ ఐట‌మ్స్ త‌యారు చేస్తారుట తార‌క్. ఇలా నాన్ వెజ్ వంట‌కాలు చేయ‌డంలో తార‌క్ చాలా స్పెష‌లిస్ట్ అట‌. బిరియానీతో పాటు క‌బాబ్స్..గ్రిల్డ్ చికెన్ అన్నింటిని రుచిక‌రంగా త‌యారు చేయ‌డంలో స్పెష‌లిస్ట్ అంట‌. ఈ విష‌యంలో ల‌క్ష్మీ ప్ర‌ణ‌తీ కూడా తార‌క్ ని ఆట ప‌ట్టిస్తుందిట‌. మ‌న‌మే మంచి హోట‌ల్ పెట్టొచ్చు.

మీ రుచుల‌కి మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుంద‌ని స‌ర‌దాగా అంటుందిట‌. బ‌య‌ట రోడ్డుపై టేబుల్ వేసి దానిపై తార‌క్ చేసిన వంట‌కాలు అన్ని పెడితే క్ష‌ణాల్లో ఖాళీ అయిపోతాయ‌ని అంటుందిట‌. అందుకు మంచి రెమ్యున‌రేష‌న్ కూడా ఇస్తాన‌ని అంటుందిట‌. ఇలా ఆదివారం వ‌స్తే ఆలుమ‌గ‌లు స‌ర‌దాగా జోకులేసుకుంటూ కాల‌క్షేపం చేస్తార‌ని తెలుస్తోంది.

తార‌క్ ఒకప్పుడు మంచి భోజ‌న ప్రియుడు కూడా. ఈ విష‌యం ఇటీవ‌లే మ‌హేష్ రివీల్ చేసారు. నెయ్యిలో ఇడ్లీలు ఎలా ముంచుకు తినేవాడివో నాకు తెలియ‌దా? అంటే అన్న ద‌య‌చేసి ఆ ఫుడ్ గురించి వ‌ద్దు అంటూ తార‌క్ వికారంగా ఓ ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చిన వీడియో నెట్టింట వైర‌ల్ అయింది. బిరియానీ అంటే టైగ‌ర్ కి ఎంతో ఇష్టం.

అందులోనూ మామ్ తయారు చేసిన బిరియానీ వంట‌కం అంటే ఇంకా ఇష్టం. నాన్ వెజ్ వంట‌కాల‌న్నీ తార‌క్ చాలా ఇష్ట‌ప‌డి ఆర‌గిస్తాడు. ఈ విష‌యంలో డార్లింగ్ ప్ర‌భాస్ ని టైగ‌ర్ కి పోటీగా దించొచ్చు. ఇద్ద‌రు మంచి నాన్ వెజ్ ప్రియులే కాబ‌ట్టి. ప్రభాస్ కూడా నాన్ వెజ్ లో ర‌క‌ర‌కాల డిషెస్ ట్రై చేస్తుంటాడు. అత‌ని ఇంటి వంట గదిలో ప్ర‌త్యేకంగా విదేశీ చెఫ్ లో కొలువు దీరారు. అట్లుంట‌ది తార‌క్-డార్లింగ్ తో నాన్ వెజ్ వ్య‌వ‌హార‌మంటే. ఆ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య సింక్ కుద‌ర‌డం విశేషం.