Begin typing your search above and press return to search.

విమెన్స్ డేకి బ్యూటీల స్పెషల్ మెసేజ్

By:  Tupaki Desk   |   8 March 2016 6:26 AM GMT
విమెన్స్ డేకి బ్యూటీల స్పెషల్ మెసేజ్
X
మహిళలు కెరీర్ పై దృష్టి నిలిపి, జీవితంలో ఏదన్నా గొప్పగా సాధించేందుకు పరుగులు తీస్తున్న రోజులువి. ఇప్పటికే కెరీర్ లో విజయాలు అందుకున్న కొందరు.. తోటి మహిళలకు తోచిన సలహాలు ఇస్తూ కొన్ని విజయసూత్రాలను చెప్పేందుకు ట్రై చేస్తున్నారు. విమెన్స్ డే స్పెషల్ గా తమ అనుభవాలనే పాఠాలుగా చెబుతున్నారు హీరోయిన్స్.

'నా తల్లిదండ్రులిద్దరూ డాక్టర్ వృత్తిలో ఉండడంతో.. 18 ఏళ్ల వయసులో ఉన్నపుడు నన్ను కూడా మెడిసిన్ తీసుకోమని వాళ్లు ప్రెజర్ చేశారు. కానీ వాళ్ల జీవనశైలి చూశాక.. పడుతున్న టెన్షన్ గమనించాక, నేను నా సొంత నిర్ణయం తీసుకున్నాను. ఒత్తిడికి తలొగ్గకుండా నా మనసుకు నచ్చిన వృత్తిని ఎంచుకున్నాను. ఎయిటీన్ ఇయర్స్ అంటే.. టీనేజ్ లో చాలా కీలకం. ఫాస్ట్ గా బైక్ నడిపేవారు, ఫుట్ బాల్ ప్లేయర్స్ కూడా నచ్చుతారు. కానీ సీరియస్ అనుబంధాలకు అది సరైన వయసు కాదు. మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి, టేకిట్ ఈజీ పాలసీ అలవర్చుకోండి' అని చెప్పింది ప్రణీత.

'నిజమైన ప్రపంచంలోకి రండి. ఎప్పటికీ కుదరదు అనే మాటను దగ్గరికి రానివ్వద్దు. లేకపోతే మీలోని నిజమైన శక్తి బయటకు రాదు. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఎక్కువగా ట్రావెల్ చేయాలి, తెలుసుకోవాలి, వచ్చే ఏడేళ్లలో సగం ప్రపంచాన్ని చుట్టేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఆ సమయంలో 3-4 ఉద్యోగాలు మారండి. తప్పులు జరిగితే సరిదిద్దుకుంటూ ముందుకు సాగండి. రెక్కలు విప్పుకుని ఎగిరేందుకు ప్రయత్నించేటపుడు ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రయాణంలో ప్రేమ, రొమాన్స్ అతి పెద్ద అడ్డంకులు. మీరు చాలా మంది మగవాళ్లను కలవచ్చు. అనుబంధాల కోసం తొందరపడద్దు' అంటోంది తాప్సీ.