Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ: ప్రణీత‌... సీతాకోక‌

By:  Tupaki Desk   |   4 Jun 2016 6:14 AM GMT
ఫొటోస్టోరీ: ప్రణీత‌... సీతాకోక‌
X
ఫ్యాష‌న్ మంత్రం జ‌పించే అతికొద్దిమంది తెలుగు క‌థానాయిక‌ల్లో ప్ర‌ణీత ఒక‌రు. ఫ్యాష‌న్ విష‌యంలో ఈ ముద్దుగుమ్మ స‌మంత - త‌మ‌న్నా - ర‌కుల్‌ ల‌కి ధీటుగా క‌నిపిస్తుంటుంది. ప్ర‌తీ ఈవెంట్‌ నీ ఒక అవ‌కాశంగా భావించి చిత్ర విచిత్ర‌మైన డ్రెస్సుల‌తో మీడియానీ - అక్క‌డున్న చూప‌రుల‌ని ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. ఇక మ‌న సినీ ఇండ‌స్ట్రీకి కావ‌ల్సింది అదే క‌దా! హీరోయిన్లు ఎప్పుడు ఏ యాంగిల్‌ లో కొత్త‌గా క‌నిపిస్తారా అని చూస్తూ ఉంటుంది. ఇలా క‌నిపించగానే వెంట‌నే నిర్మాతలు త‌మ సినిమాల‌కోసం బుక్ చేసేస్తుంటారు.

ప్ర‌ణీత అలా బోలెడ‌న్ని అవ‌కాశాలు అందుకొంది. భ‌విష్య‌త్తులోనూ ఫ్యాష‌నే మంత్రంగా దుమ్ము దులిపేస్తాన‌ని న‌మ్మ‌కంగా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ‌. అన్న‌ట్టు నిన్న జ‌రిగిన సైమా ఈవెంట్‌ కి ప్ర‌ణీత వేసుకొచ్చిన సీతాకోక చిలుక మోడ‌ల్ డ్రెస్సే హైలెట్‌ గా నిలిచింది. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి - ప్ర‌గ్యాజైశ్వాల్‌ - అమైరాలాంటి మోడ‌ల్స్‌ ని కాద‌ని అంద‌రి క‌ళ్లూ ప్ర‌ణీత‌పై ప‌డ్డాయంటే ఆమె వేసుకొచ్చిన డ్రెస్సులో ఎంత ప్ర‌త్యేక‌త ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌ణీత సైమాలో లైవ్ పెర్‌ ఫార్మెన్స్ ఇవ్వ‌బోతోంద‌ట‌. అక్క‌డ కూడా ఫ్యాష‌న్ మంత్రం జ‌పిస్తాన‌ని చెప్పుకొచ్చింది.