Begin typing your search above and press return to search.
ప్రణీతను కాపాడిన సీటు బెల్టు!
By: Tupaki Desk | 14 Feb 2016 3:30 PM GMTఖమ్మంలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరై హైదరాబాద్ వస్తున్న సినీనటి ప్రణీత కారు యాక్సిడెంట్ కు గురి కావటం తెలిసిందే. ఎదురుగా వస్తున్న ఒక కారును తప్పించే క్రమంలో అదుపు తప్పిన కారు.. బోల్తా పడింది.
ప్రమాదానికి గురైన సమయంలో కారు వేగంగా ఉండటంతో అదుపు చేయటం సాధ్యం కాలేదని చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రణీత సిబ్బంది.. ఆమె తల్లికి గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణించే సమయంలో ప్రణీత సీటు బెల్ట్ పెట్టుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. . ప్రముఖులుపలువురు తాము కారులో ప్రయాణించే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. దీనికి వారు భారీగానే మూల్యం చెల్లిస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రణీత సీటు బెల్ట్ పెట్టుకోవటం ఆమెకు స్వల్ప గాయాలకే పరిమితం చేసింది. కారు ప్రయాణ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవటం ఎంత తప్పనిసరి అన్నది తాజా ఘటన స్పష్టం చేస్తుంది.