Begin typing your search above and press return to search.
ప్రణీత కూడా మొదలెట్టింది
By: Tupaki Desk | 7 Nov 2015 3:30 PM GMTఅమ్మో... మన బాపుగారి బొమ్మ హుషారైనదే. చూడ్డానికి అమాయకంగా, సినిమా తప్ప మరో లోకం తెలియదేమో అన్నట్టుగా కనిపిస్తుంది కానీ... అందరిలాగే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా అడుగులు వేస్తోంది కన్నడ కస్తూరి ప్రణీత. కథానాయికగా తెలుగుతో పాటు, కన్నడలోనూ జోరును ప్రదర్శిస్తున్న ప్రణీత హోటల్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇటీవల బెంగుళూరులో ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించింది. అనుకొన్నట్టుగా సక్సెస్ అయితే ఆ రెస్టారెంట్లను అంచలంచెలుగా విస్తరిస్తుందట.
కథానాయికలు ఇలా సైడ్ బిజినెస్ ల్లోకి ఎంటర్ అవ్వడం కొత్తేమీ కాదు. ఏ ఒకరిద్దరో తప్ప దాదాపు ప్రతీ కథానాయిక ఇలా తమకు ఇష్టమైన మరో రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. సినిమాల్లో అవకాశాలు ఎంతోకాలం ఉండవు. ఫేస్ పై ఛార్మింగ్ తగ్గిందనగానే ఇండస్ట్రీ మరొకరిని వెదుక్కొంటుంటుంది. అందుకే కథానాయికలు ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రత్యామ్నాయంగా మరో రంగాన్ని కూడా వెదుక్కుంటుంటారు. ఎప్పుడైతే సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోతాయో అప్పుడు సైడ్ బిజినెస్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుంటారు. అలా ప్రణీత కూడా హోటల్ రంగంలోకి అడుగుపెట్టిందన్నమాట.
అయితే ప్రణీత సైడ్ బిజినెస్ మొదలెట్టగానే కన్నడలో అందరూ ఆమె ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని మాట్లాడుకొంటున్నారట. ఆ విషయం ప్రణీత దృష్టికి కూడా వచ్చింది. దీంతో వెంటనే అమ్మడు కలగజేసుకొని సినిమాలకీ, నేను మొదలుపెట్టే వ్యాపారానికీ మధ్య సంబంధమేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. ``నా అభిరుచికొద్దీ హోటల్ రంగంలోకి అడుగుపెట్టా. అంత మాత్రాన సినిమాలకి దూరం కాను. కథానాయికగా ఇంకా నాకు బోలెడంత ఫ్యూచర్ ఉంది. బోలెడన్ని సినిమాల్లో నటించాల్సి వుంది`` అని ప్రణీత చెప్పుకొచ్చింది.