Begin typing your search above and press return to search.
బాపు బొమ్మ మిస్సింగ్! కట్ చేస్తే!!
By: Tupaki Desk | 7 Oct 2018 12:53 PM GMTబాపు బొమ్మ ప్రణీత గత కొంతకాలంగా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి మిస్సవ్వడంతో అభిమానులు కాస్తంత బెంగగానే ఉన్నారు. చేపకళ్లతో .. తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ ప్రతిభ ఉండీ ఎందుకనో స్టార్ డమ్ ని మాత్రం అందుకోలేకపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాలన్న కల మాత్రం నెరవేరలేదు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వం లో అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించినా ప్రణీత ఫేట్ మాత్రం మారలేదు. మహేష్ సరసన బ్రహ్మోత్సవం - ఎన్టీఆర్ సరసన రభస చిత్రాల్లోనూ నటించింది. అయితే పవన్ సినిమా తప్ప అగ్రకథానాయకుల సరసన నటించిన ఇతర సినిమాలన్నీ ఫ్లాపవ్వడం ప్రణీత కెరీర్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేశాయి. ఆ క్రమంలోనే ఇరుగు పొరుగు పరిశ్రమల్లో ప్రయత్నాలు సాగించింది. తమిళంలో కార్తీ - అధర్వ లాంటి హీరోలు హ్యాండిచ్చినా పనవ్వలేదు. ప్రస్తుతం మరోసారి టాలీవుడ్ లో రామ్ -అనుపమ జంటగా నటిస్తున్న హలో గురూ ప్రేమకోసమే చిత్రంలో ప్రణీత నటిస్తోందని తెలుస్తోంది.
ఇంతకీ రామ్ చిత్రంలో ప్రణీత పాత్ర ఏంటి ? అంటే మరోసారి సెకండ్ హీరోయిన్ కేటగిరీనే. ఈ చిత్రంలో అనుపమ ప్రధాన నాయిక. ఇటీవలే హైదరాబాద్ లో ఓ రిబ్బను కటింగ్ కార్యక్రమంలోనూ ప్రణీత పాల్గొంది. ప్రఖ్యాత సిల్క్స్ షోరూమ్ లాంచ్ లో తళుక్కుమంది. ఒక్కో బ్రాండ్ ప్రచారానికి ఈ భామ రూ.40లక్షల వరకూ ఛార్జ్ చేస్తోందన్న సమాచారం ఉంది.