Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అబ్బా లుక్ అదిరిపోయింది..

By:  Tupaki Desk   |   6 March 2017 7:59 AM GMT
ఫోటో స్టోరి: అబ్బా లుక్ అదిరిపోయింది..
X
పవన్ కళ్యాణ్ పక్కన ఒకే ఒక్క సినిమా అత్తారింటికి దారేదిలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రణీతా సుభాష్.. మెయిన్ హీరోయిన్ సమంత కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించేసుకుంది. టాలీవుడ్ కి బాపు బొమ్మగా మారిపోయింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అవకాశాలు వచ్చినా.. ఆ రేంజ్ ని మాత్రం కొనసాగించడంలో విఫలమైంది ఈ బ్యూటీ.

సినిమాల్లో అయితే అమ్మడికి అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి కానీ.. బ్రాండింగ్ విషయంలో మాత్రం ఈ భామ బాగా రేంజ్ పెంచేసుకుంది. అనేక షాపింగ్ మాల్స్.. శారీ మాల్స్.. ఈమె వెనకపడుతూనే ఉన్నాయి. అలా ఎందుకు పడతున్నాయనే విషయం.. రీసెంట్ గా ప్రణీత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే అర్ధమవుతుంది. ఆకుపచ్చని పట్టుచీరకు మ్యాచింగ్ జాకెట్ అండ్ ఆర్నమెంట్స్ తో ప్రణీత లుక్ సూపర్ గా ఉంది. నడుం ఒంపులు కూడా కనిపించేలా కట్టిన చీరకట్టు చూస్తే.. మహిళలైనా కుళ్లుకోవాల్సిందే.

ఆ చీర ఈమెకు అద్దినట్లుగా అంత అద్భుతంగా సరిపోయింది మరి. అచ్చ తెలుగింటి మహిళ లుక్ కు తనను మించిన వారు మరొకరు లేరన్నట్లుగా మెరిసిపోయింది ప్రణీతా సుభాష్. మరి ఈ కన్నడ భామకు మరో మంచి అవకాశం టాలీవుడ్ ఇస్తుందా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/