Begin typing your search above and press return to search.
బాపుబొమ్మ.. వేదాంతం చెబుతోందే
By: Tupaki Desk | 10 May 2018 1:30 AM GMTఎన్ని సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కలేదు గాని సీనియర్ హీరోయిన్ గా మాత్రం క్రేజ్ అందుకుంది క్యూటీ గర్ల్ ప్రణీత. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి సినిమాల్లో కొనసాగుతోన్న ఈ బ్యూటీ కెరీర్ ని ఓ లెవెల్లో సెట్ చేసుకుంటూ వెళుతోంది. కెరీర్లో ఆఫర్స్ పెద్దగా రాలేవు. స్టార్ హీరోలతో అవకాశం వస్తే చాలు చిన్న పాత్ర పెద్ద పాత్ర అని బేధం చూపకుండా ఒప్పేసుకుంటోంది. ఇక చిన్న హీరోల నుంచి మంచి కథ అందితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
చివరగా ప్రణీత బ్రహ్మోత్సవం సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో ప్రణీతను ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక చాలా కాలం తరువాత రామ్ తో కలిసి నటించడానికి రెడీ అయ్యింది. నేను లోకల్ దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో రామ్ - హలో గురు ప్రేమ కోసమే అనే సినిమా చేస్తున్నాడు. అయితే సినిమాకు సంబందించిన విషయాలను అలాగే తన కెరీర్ గురించి ప్రణీత కొన్ని విషయాలను తెలిపింది.
అందరూ ఈ సినిమా నాకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని అంటున్నారు. కానీ నాకు అలాంటి ఫీలింగ్ ఏమి లేదు. గత ఏడాది వరకు కన్నడ తమిళ్ సినిమాలు బాగానే చేశాను. కాకపోతే తెలుగుకు కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చాను. నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లడమే నా గోల్. కథలో కాస్త ఇంపార్టెంట్ ఉన్నా కూడా సినిమా చేసేస్తాను. హలో గురు ప్రేమ కోసమే అనేకథ నాకు చాలా నచ్చింది. వినగానే ఒకే చేశా. మామ అల్లుళ్ల మధ్య జరిగే సన్నివేశాల లవ్ యాంగిల్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. తప్పకుండా ఈ సినిమాతో తనకు మంచి విజయం అందుతుందని 'బాపుబొమ్మ' ప్రణీత వేదాంతం వర్ణించింది.