Begin typing your search above and press return to search.

ఫిట్‌ నెస్‌ కోసం హార్స్‌ రైడ్‌ ఏంటి అమ్మడు?

By:  Tupaki Desk   |   31 Oct 2020 12:30 AM GMT
ఫిట్‌ నెస్‌ కోసం హార్స్‌ రైడ్‌ ఏంటి అమ్మడు?
X
టాలీవుడ్‌ లో కొందరు హీరోయిన్స్‌ కు స్టార్‌ హీరోల సరసన నటించినా.. పెద్ద సినిమాల్లో నటించినా కూడా బ్రేక్‌ రాదు. ఉన్నట్లే ఉంటారు కనిపించకుండా పోతారు. అలాంటి ఒక హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌. ఈమె టాలీవుడ్‌ లో పవన్‌ మరియు ఎన్టీఆర్‌ వంటి పెద్ద హీరోల సినిమాల్లో కనిపించింది. కాని అదృష్టం కలిసి రాకపోవడం వల్లో లేక మరేంటో కాని కంటిన్యూగా ఈమెకు ఆఫర్లు రాలేదు. దాంతో మెల్లగా ఈమె కెరీర్‌ ఫేడ్‌ ఔట్‌ అయ్యింది. తెలుగులో ఆఫర్లు రాని సమయంలో ఇతర భాషల్లో ప్రయత్నించి ఒకింత సక్సెస్‌ అయ్యింది. తెలుగులో మళ్లీ అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న ఈ అమ్మడు సాధ్యం అయినంత వరకు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండేందుకు.. వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఈమె లాక్‌ డౌన్ టైమ్‌ లో హార్స్‌ రైడింగ్‌ నేర్చుకుంది. ఈ విషయం ఆమె తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో ఫొటో షేర్‌ చేసింది. ఉన్నట్లుండి హార్స్‌ రైడింగ్‌ ఎందుకు అంటూ పలువురు నెటిజన్స్‌ ఆమెను ప్రశ్నించారు. ఏదైన సినిమాలో పాత్ర కోసం మీరు హార్స్‌ రైడింగ్‌ నేర్చుకుంటున్నారా అంటూ ఎక్కువ మంది ప్రశ్నించడంతో కేవలం ఫిట్‌ నెస్‌ కోసమే హార్స్‌ రైడింగ్‌ నేర్చుకున్నాను అంటూ చెప్పింది. అదేంటి ఫిట్‌ నెస్‌ కోసం ఎవరైనా హార్స్‌ రైడింగ్‌ నేర్చుకుంటారా ఫన్నీగా ఉంది మీ సమాధానం అంటూ నెటిజన్స్‌ ఆమెకు కౌంటర్‌ ఇస్తున్నారు.