Begin typing your search above and press return to search.

ప్రణీత తప్పు చేస్తోందా?!

By:  Tupaki Desk   |   11 Jun 2015 6:35 AM GMT
ప్రణీత తప్పు చేస్తోందా?!
X
కథానాయికలంతా యువ హీరోల సినిమాలకే ప్రాధాన్యమిస్తుంటారు. సీనియర్‌ హీరోలకంటే యువ హీరోలతో కలిసి నటిస్తేనే కెరీర్‌కి మైలేజ్‌ ఉంటుందని నమ్ముతుంటారు. ఒక్కసారి సీనియర్లతో కలిసి నటిస్తే ఆ తర్వాత మళ్లీ యువ హీరోల సరసన నటించే అవకాశాలు ఈజీగా దొరకవనే భయం కూడా వారిలో ఉంటుంది. అందుకే మంచి అవకాశాలొచ్చినా కొద్దిమంది సీనియర్లతో కలిసి నటించరు. అంతెందుకు ఆ మధ్య... వెంకీ సరసన నటించే అవకాశమొస్తే నిత్యమీనన్‌ తోసిపుచ్చింది. ఇంచుమించు కథానాయికలంతా ఇదే పద్ధతిని ఫాలో అవుతుంటారు. అయితే ప్రణీత మాత్రం ఇటీవల తీసుకొన్న ఓ నిర్ణయం అందరినీ షాక్‌ గురి చేసింది. ఆమె ఓ సీనియర్‌ కథానాయకుడి సినిమాలో నటించేందుకు ఒప్పుకొందట. ఆ నిర్ణయం విన్న చాలా మంది ప్రణీత తప్పు చేస్తోందని మాట్లాడుకొంటున్నారు.

'అత్తారింటికి దారేది'లో పవన్‌కల్యాణ్‌ సరసన నటించిన ఆమె అందరి దృష్టినీ ఆకర్షించేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌ నుంచి వరుసగా అవకాశాలొచ్చాయి. అవి సక్సెస్‌ అయ్యింది లేదు కానీ... ప్రణీత మాత్రం మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చినట్టయింది. ఇప్పుడు కూడా విష్ణు సరసన 'డైనమైట్‌'లో నటిస్తోంది. మహేష్‌తో కలిసి 'శ్రీమంతుడు'లోనూ నటించబోతోందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ దశలోనే ఓ సీనియర్‌ అగ్ర హీరో సినిమాలో రెండో కథానాయికగా ప్రణీత కనిపించబోతోందంటూ వార్తలొచ్చాయి. అవి విన్నవాళ్లంతా షాక్‌కి గురయ్యారు. ప్రణీతకి ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందని మాట్లాడుకొంటున్నారు. భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతోనే ఆమె సినిమా చేయడానికి ఒప్పుకొందని కొద్దిమంది చెప్పుకొంటున్నారు.