Begin typing your search above and press return to search.

ఛారిటీ షో కోసం అందాలు ధారపోస్తోందిగా

By:  Tupaki Desk   |   19 Oct 2016 3:30 AM GMT
ఛారిటీ షో కోసం అందాలు ధారపోస్తోందిగా
X
బెంగళూరు బ్యూటీ ప్రణీతా సుభాష్ పలు భాషల్లో సినిమాలు చేస్తున్నా.. తెలుగు సినిమాపై మాత్రం బోలెడంత మమకారం చూపించేస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో టాలీవుడ్ సినిమాలు చేస్తున్నా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేదిలో బాపు బొమ్మగా కనిపించిన తర్వాత.. క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ రేంజ్ ని అదే స్థాయిలో కంటిన్యూ చేయడంలో విఫలం అయినా.. అమ్మడికి ఇక్కడ క్రేజ్ విషయంలో కొరత లేదు.

మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఛారిటీ సెలబ్రిటీ షో మేము సైతం కార్యక్రమానికి ప్రణీతను ఆహ్వానిస్తే.. ఈ భామ ఇలా అటెండ్ అయిపోయింది. మోకాలికి ఓ అరడుగు పై వరకూ ఉన్న స్లీవ్ లెస్ బ్లూ జీన్స్ టాప్.. దానిపై ట్రాన్స్ పరెంట్ వైట్ ఓవర్ కోట్.. ఆ కోట్ పై స్పాంటేనియస్ గా డిజైన్ చేసిన గులాబీలు.. అబ్బో అమ్మడి లుక్ అదిరిపోయిందంతే. అందం విషయంలో ఎలాంటి వంక పెట్టడానికి వీలు లేని ఈ బ్యూటీ.. అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో రెడీ అయితే ఎలా ఉంటుందో చూపించేసింది.

మేము సైతం కార్యక్రమానికి ఇప్పటివరకూ చాలామంది హీరోయిన్లు హాజరయ్యారు కానీ.. ఇలా అందాలు కురిపిస్తూ మెస్మరైజ్ చేసిన వాళ్లు మాత్రం లేరు. ఈ బ్యూటీ ఆ కొరత కూడా తీర్చేసినట్లుంది కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/