Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : పెళ్లైనా తగ్గేదేలే అంటున్న అమ్మడు..!

By:  Tupaki Desk   |   31 Dec 2022 4:48 AM GMT
ఫోటో స్టోరీ : పెళ్లైనా తగ్గేదేలే అంటున్న అమ్మడు..!
X
కన్నడ భామ ప్రణీత తెలుగులో యువ హీరోల సరసన నటిస్తూ మెప్పించింది. స్టార్ హీరోయిన్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా కూడా అమ్మడికి ఎందుకో లక్ కలిసి రాలేదు. అందుకే యువ హీరోలతోనే సరిపెట్టుకుంది. అత్తారింటికి దారేది లాంటి సినిమాలో నటించినా సరే ఆమె ఫేట్ మారలేదు సరికదా ఆ దెబ్బతో ఆమె సైడ్ హీరోయిన్ గా మారిపోయింది. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకున్న ప్రణీత సుభాష్ సడెన్ గా బిజినెస్ మెన్ నితిన్ రాజుని పెళ్లాడి షాక్ ఇచ్చింది.

2021లో అతన్ని పెళ్లాడిన ప్రణీత ఒక పాపకు జన్మనిచ్చింది. పెళ్లై ఒక పాప ఉన్నా సరే మళ్లీ సినిమాల్లో రాణించాలని చూస్తుంది ప్రణీత. అంతేకాదు ఆఫ్టర్ మ్యారేజ్ గ్లామర్ డోస్ కూడా బాగా పెంచేసింది అమ్మడు. ప్రణీత ఫోటో షూట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. గ్లామర్ షోలో ఎక్కడ తగ్గని ప్రణీత తన మార్క్ టాలెంట్ చూపిస్తుంది. లేటెస్ట్ గా మరో గ్లామర్ ఫోటో షూట్ తో కుర్ర్లలని డిస్టర్బ్ చేస్తుంది అమ్మడు. ప్రణీత లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే వైట్ టాప్ తో అందాలన్ని కనిపించేలా.. డెనిమ్ జీన్స్.. కళ్లకి గాగుల్స్.. అసలు తనకు పెళ్లైంది.. ఒక పాప కూడా ఉంది అన్న ఆలోచన కూడా ఎక్కడ లేని విధంగా ప్రణీత రెచ్చిపోతుంది.

గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే ఆ మాత్రం ఉండక తప్పదని అమ్మడు కనిపెట్టేసింది. అందుకే తనలోని ఈ హాట్ యాంగిల్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది అమ్మడు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇన్నాళ్లు సౌత్ సినిమాలు చేస్తూ వచ్చిన ప్రణీత హంగామా 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేస్తూ వస్తుంది ప్రణీత. సినిమా హీరోయిన్ గానే కాదు సోషల్ సర్వీస్ లో కూడా ప్రణీత తన మార్క్ చూపిస్తుంది.

కోవిడ్ టైం లో తన ఫౌండేషన్ ద్వారా చాలామంది ఆకలి తీర్చి తన మంచి మనసు చాటుకుంది ప్రణీత. అంతేకాదు ఇప్పటికీ ఆమె ఫౌండేషన్ ద్వారా కొంత సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాల్లో తను సంపాధించిన కొంత మొత్తాన్ని ఈ సర్వీస్ కి వాడేస్తుంది. అందుకే ప్రణీత కెరీర్ బాగుండాలని కోరుతున్నారు ప్రేక్షకులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.