Begin typing your search above and press return to search.
ప్రణీత .. సెకండ్ గ్రేడ్ యాక్టరే ఎప్పటికీ!
By: Tupaki Desk | 5 Sep 2015 5:53 AM GMTఒక నటి పరిపూర్ణ నటి అని చెప్పాలంటే కొలమానాలేంటి? అందం(బ్యూటీ), అభినయం (ఎక్స్ ప్రెషన్), మాట తీరు, ఒడ్డు పొడవు, డ్యాన్సింగ్ స్టయిల్, కళల్లో ప్రవేశం తదితరాలన్నీ ఫ్యాక్టర్లే. అయితే టాలీవుడ్ హీరోయిన్లకు ఈ తూనికలు వేస్తే తూకంలో తేడాలొచ్చేస్తాయ్. ఒక్కోసారి ఐఫీస్ట్ లా కనిపిస్తే చాలు ఆ అమ్మడిని పిలిచి అవకాశాలిచ్చేసే దర్శకులు కూడా ఉన్నారు. అలా ఎంపికైన నాయికలంతా ఆ తర్వాత ఫ్లాప్ బాట పట్టేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే ఈ కేటగిరీలోనే కొందరు నాయికలు ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నవాళ్లలోనూ ఉన్నారు. ఎంత కాలంగా ఏటికి ఎదురీదినా ఎప్పటికీ ద్వితీయ శ్రేణిలో పడి కొట్టుకుపోయే అలాంటి నాయికల జాబితాలో ప్రణీత పేరు కూడా చేర్చొచ్చు.
ఎందుకంటే ఈ భామ కెరీర్ ప్రారంభించి ఇప్పటికే ఐదేళ్లు పైగానే అవుతోంది. పవన్ కల్యాణ్ -ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించేసింది. అయినా ఇప్పటికీ తనో పెద్ద స్టార్ హీరోయిన్ అని మాత్రం అనిపించు కోలేకపోయింది. తనతో పాటే కెరీర్ సాగించిన సమంత ఫస్ట్ క్లాస్ హీరోయిన్ గా దూసుకుపోతుంటే తను మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టే ఉంది. లేటెస్టుగా విష్ణు సరసన డైనమైట్ సినిమాలో నటించిన ఈ అమ్మడు పేలవంగా తేలిపోయిందంటూ విమర్శలొస్తున్నాయి. యాక్షన్, సెంటిమెంటు, రొమాన్స్, ఫైర్, లవ్ .. ఇలా సందర్భం ఏదైనా అక్కడ ఈవిడ పలికించే ఎక్స్ ప్రెషన్ ఒకే ఒక్కటి. ఆ ఒక్క ఎక్స్ ప్రెషన్ తో నే సినిమా అంతా నడిపించేసింది అమ్మడు. ఇప్పుడర్థమైందా? సెకండ్ గ్రేడ్ హీరోయిన్లు ఎప్పటికీ స్టార్ స్టాటస్ ని ఎందుకు అందుకోలేరో?