Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : బేబీ బంప్‌ తోనూ బాపు బొమ్మ అదుర్స్‌

By:  Tupaki Desk   |   3 Jun 2022 7:31 AM GMT
ఫోటోటాక్ : బేబీ బంప్‌ తోనూ బాపు బొమ్మ అదుర్స్‌
X
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. తెలుగు లో చాలా సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా లో పవన్ ఈమెను ఉద్దేశించి పాడిన బాపు బొమ్మ పాట బాగా ఫేమస్ అయ్యింది.. అప్పటి నుండి బాబు బొమ్మ ప్రణీత అంటూ ఆమెను గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో జనాలు చర్చించుకుంటున్నారు.

మొన్నటి వరకు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్న ప్రణీత ఇటీవలే పెళ్లి చేసుకుంది. పెళ్లి విషయాన్ని పెద్దగా హడావుడి చేయలేదు. ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెల్సిందే. తాను గర్బవతిని అనే విషయాన్ని కొన్ని వారాల క్రితం ప్రకటించిన ప్రణీత సుభాష్‌ వరుసగా తన బేబీ బంప్ ఫోటో షూట్స్ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వస్తుంది.

మీడియాలో ఈమద్య ప్రణీత గురించి తెగ చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా మరో ఫోటో షూట్‌ తో జనాల మద్యకు వచ్చింది. ఇన్‌ స్టా లో ప్రణీత షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

బేబీ బంప్ తోనూ ఈ బాపు బొమ్మ అందంగా ఉంది.. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి అందం మరింతగా పెరిగినట్లు అయ్యింది. తల్లి కాబోతున్నాను అనే ఆనందం ఆమె మొహంలో కనిపించడం వల్లనో ఏమో కాని మరింత అందంగా ఈమె కనిపిస్తుంది.

సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ముద్దుగుమ్మ ప్రణీత బేబీ బంప్ ఫోటోలతో కూడా తన ఫాలోవర్స్ ను ఎంటర్‌ టైన్ చేస్తుంది.

ఈమద్య కాలంలో హీరోయిన్స్ బేబీ బంప్ తో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అనేది చాలా కామన్‌ విషయం అయ్యింది. అది ఫ్యాషన్ గా కూడా మారింది. అందుకే ప్రణీత బేబీ బంప్ ఫోటో షూట్‌ ను చాలా మంది సమర్థిస్తూ ఉన్నారు.