Begin typing your search above and press return to search.
ప్రసాద్స్ ఐమాక్స్ లార్జ్ స్క్రీన్ ఫీల్ కోల్పోయినట్లే!
By: Tupaki Desk | 18 Dec 2021 7:30 AM GMTభాగ్యనగరంలో ప్రసాద్స్ ఐమాక్స్ ప్రత్యేకతల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఐమాక్స్ అంటే హైదరాబాద్..హైదరాబాద్ అంటై ఐమాక్స్ అన్నంతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. హైదరాబాద్ వెళ్లినవారంతా ఒక్కసారైనా ఐమాక్స్ లో సినిమా చూడాలని అనుకుంటారు. అంతగా ప్రసాద్ ఐమాక్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు...దేశంలోనే గొప్ప మనన్నలు అందుకుంది.
ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ గా హైదరాబాద్ ఐమాక్స్ పాపులరైంది. అవతార్ లాంటి సినిమా ఏకంగా ఏడాదంతా అదే స్క్రీన్ లో ఆడిందంటే? దాని ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రసాద్ ఐమాక్స్ పేరుని ఇప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ గా మార్చేస్తున్నారు.
సడెన్ గా ఎందుకు ఈ మార్పు అంటే... చాలా సంగతులే ఉన్నాయి. ఐమాక్స్ ప్రోజెక్షన్ టెక్నాలజీ ఇటీవల ఉపయోగించడం లేదని తెలిసింది. అంతా డిజిటైలైజేషన్ అయిపోయింది. కంటెంట్ డెలివిరీ విధానంలో చాలా సాంకేతికత అందుబాటులోకి వచ్చేసింది. డిజిటల్ ఫార్మాట్ ప్రొజెక్షన్ ప్రారంభమైన తర్వాత ఐమాక్స్ ప్రొజెక్షన్ చాలా క్లిష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో ఐమాక్స్ ప్రొజెక్షన్ కి కాలం చెల్లింది కాబట్టి ఆ పేరుతో పిలవడం సరికాదని..పైగా చట్టం పరంగా వ్యతిరేకంగాను ఉంటుందని భావించి పేరు మార్చినట్లు తెలుస్తోంది. ఇక నుంచి కూడా బిగ్ స్క్రీన్ ఉంటుంది. కానీ ఇది ఐమాక్స్ వెర్షన్ కి బధులుగా సాధారణ డిజిలైజ్డ్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది.
అయితే ఐమాక్స్ తో పోల్చుకుంటే వీక్షణలో చాలా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఐమాక్స్ ఫీల్ ని డిజిటలైజేషన్ స్క్రీన్ అందివ్వదు. ఇదే గనుక నిజమైతే ఐమాక్స్ ప్రత్యేకతను కోల్పోయినట్లే. ప్రసాద్ ఐమాక్స్ కి బిగ్ స్క్రీన్ లో సినిమా చూసి థ్రిల్ ఫీలవ్వడానికే సినీ ప్రియులు క్యూ కడతారు.
ముఖ్యంగా ఉత్తరాది ఆడియన్స్ ఎక్కువగా బిగ్ స్క్రీన్ లో హాలీవుడ్ సినిమాల్ని చూడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ స్క్రీన్ కేవలం హాలీవుడ్ చిత్రాలకే కేటాయిస్తారు. అరుదుగా మాత్రమే ఇతర సినిమాల ప్రదర్శన ఉంటుంది.