Begin typing your search above and press return to search.
శృతిదే తప్పు.. నాపై రాంగ్ పబ్లిసిటీ!
By: Tupaki Desk | 3 April 2019 7:48 AM GMT`ఊపిరి` మూవీ సమయంలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ను నిర్మాత పీవీపీ ఏడిపించారని, తనపై తప్పుడు కేసులు పెట్టారని విజయవాడ ఎంపీ కేసినేని నాని ఆరోపించిన సంగతి తెలిసిందే. అలా ఎందరో కథానాయికల్ని, దర్శకులు, హీరోల్ని పీవీపీ వేధించారని, అతడి వేధింపులకు మహేష్ ఒక్కడే లొంగలేదని కేసినేని తీవ్రంగానే ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల అనంతరం టాలీవుడ్ లో దీనిపై ఆసక్తికర చర్చ సాగింది. పీవీపీ నిజంగానే కథానాయికల్ని ఏడిపించారా? అంటూ ముచ్చటించుకున్నారు.
తాజాగా ఓ ప్రచార వేదికపై పీవీపీ దీనికి వివరణ ఇచ్చారు. ``ఊపిరి మూవీ షూటింగ్ మధ్యలోనే శ్రుతి హాసన్ వెళ్లిపోయారు. తప్పు తనదే. అందుకే పారితోషికం తిరిగి తీసుకున్నాం. అందులో తప్పేం ఉంది? `` అని ప్రశ్నించారు. స్టార్ హీరోయిన్లు అనుష్క .. తమన్న.. సమంత... ఇలా ఎందరో మా బ్యానర్ లో సినిమాలు చేశారు. ఎవరూ ఆరోపణలు చేయలేదు! నాని ఇలాంటి తప్పుడు మాటలు బంద్ చేయాలి`` అంటూ కాస్తంత ఘాటుగానే సమాధానం ఇచ్చారు పీవీపీ.
రాజకీయ రణక్షేత్రంలో బెజవాడ రణభూమిగా మారుతున్న వేళ ప్రత్యర్థులపై ఎవరికి వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామిక వేత్త, సినీనిర్మాత అయిన పీవీపీ ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. విజయవాడ ఎంపీగా వైకాపా తరపున పోటీ చేస్తున్నారు. పోటీబరిలో తేదేపా అభ్యర్తి కేసినేని నాని అప్పట్లో ఆరోపణలు గుప్పించారు. అందుకు పీవీపీ లేటెస్టుగా స్పందించారన్నమాట.