Begin typing your search above and press return to search.
మళ్లీ తల్లయిన హీరోయిన్
By: Tupaki Desk | 24 Jan 2020 1:08 PM GMTతెలుగు మరియు తమిళంలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన స్నేహా 2012వ సంవత్సరంలో తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వివాహం తర్వాత కూడా స్నేహా నటిగా కొనసాగింది. పెళ్లి అయిన కొన్నాళ్లకే స్నేహా బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు విహాన్ అనే పేరును పెట్టారు. బాబు పుట్టిన తర్వాత కూడా పలు చిత్రాల్లో మరియు బుల్లి తెర కార్యక్రమాల్లో కనిపించిన స్నేహా గత కొన్ని నెలలుగా కనిపించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఆ అనుమానాలు అన్ని పటాపంచలు చేస్తూ స్నేహా మరోసారి తల్లి అయ్యిందంటూ ప్రసన్న ప్రకటించాడు. ఆడపిల్ల పుట్టిందంటూ చాలా సంతోషంగా ప్రకటించాడు. మొదట బాబుకు జన్మనిచ్చిన స్నేహా రెండవ సారి అమ్మాయికి జన్మనిచ్చిందని, జాతీయ బాలికల దినోత్సవం రోజున స్నేహా అమ్మాయికి జన్మనివ్వడం యాదృశ్చికం అయినా చాలా బాగా కలిసి వచ్చిందంటూ ఆమె అభిమానులు అంటున్నారు.
అచ్చముండు అచ్చముండు అనే తమిళ చిత్రంలో స్నేహా మరియు ప్రసన్న కలిసి నటించారు. ఆ సినిమా సందర్బంగా వారి మద్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి మద్య అన్యోన్యం పెరిగింది. 2012లో వీరి వివాహం ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో జరిగింది. ఆ ప్రేమ జంట ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. బేబీ పుట్టడంతో కాస్త బ్రేక్ తీసుకుని స్నేహా మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.