Begin typing your search above and press return to search.
ఆవేశంలో చరిత్ర మరిచారే!
By: Tupaki Desk | 7 Jan 2019 9:53 AM GMTఅసలు కంటే కొసరు ముద్దు అన్నట్టు నిన్న జరిగిన పేట ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా గురించి కన్నా ఇతర విషయాల గురించి ఎక్కువ హై లైట్ అవుతోంది. వల్లభనేని అశోక్ థియేటర్ల మాఫియా అంటూ అగ్ర నిర్మాతల గురించి చేసిన కామెంట్స్ ఇప్పటికే వేడి రాజేయగా మరో నిర్మాత ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే అర్థం లేని ఆవేశంలో వీళ్ళు అన్న మాటలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇంకా నాలుగు సినిమాలు విడుదల కాకుండానే వాటి ఫలితాల గురించి చెప్పిన ప్రసన్న పోటీలో కేవలం ఎన్టీఆర్-పేటలు మాత్రమే ఉంటాయని మిగిలినవి దుకాణం సర్దాల్సిందేనన్న తరహాలో వివాదాస్పదంగా మాట్లాడటం గమనార్హం.
అంతేకాదు సూపర్ స్టార్ రజనికాంత్ జీవితంలో కేవలం ఇద్దరికే పాదాభివందనం చేస్తారని ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు రాఘవేంద్ర స్వామి అని కాబట్టి ఎన్టీఆర్ సినిమాతో పేట మాత్రం సక్సెస్ అవుతాయట. అయితే ప్రసన్న ఇక్కడే పేట సాంబార్ లో కాలేసాడు. రజనికాంత్ ఈ ఇద్దరికే పాదాభివందనం చేస్తారని ఎక్కడా లేదు. ఓసారి కొన్నేళ్ళ క్రితమే ఓ వేదికపై అమితాబ్ బచ్చన్ కాళ్ళకు రజని చేయి ఆయన కాలికి తాకిస్తూ నమస్కారం చేయడం మీడియా దృష్టిలోనే ఉంది.
అది ఎవరికి తెలియదు అనే తరహాలో ప్రసన్న కుమార్ చెప్పిన మాటలు అర్థరహితమని తేలిపోయాయి. మరి ఈ ఇద్దరే అయినప్పుడు అమితాబ్ కాళ్ళకు దండం పెట్టిన రజని ఆయన తమ్ముడా అంటూ సోషల్ మీడియాలో నెటిజేన్లు నిలదీస్తున్నారు. ఆలస్యంగా విడుదలను ప్రకటించుకుని ఇప్పుడు థియేటర్లు దొరకలేదని అనవసరంగా దుమ్మెతి పోయడమే కాక ఇలా కామెడీ చేసుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది.