Begin typing your search above and press return to search.
కల్కి రివ్యూలు.. అలా అంటున్న ప్రశాంత్ వర్మ
By: Tupaki Desk | 1 July 2019 9:27 AM GMTప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం 'కల్కి' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ కట్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఆ అంచనాలు అందుకోలేకపోయింది. మౌత్ టాక్ గొప్పగా లేదు.. రివ్యూ రేటింగ్స్ తక్కువే వచ్చాయి.
రీసెంట్ గా ఈ రివ్యూలపై.. తక్కువ రేటింగులపై దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని సక్సెస్ అయిందని చెప్తూనే.. తనే కనుక ఈ సినిమాకు రివ్యూ రాసి ఉంటే తక్కువ రేటింగే ఇచ్చి ఉండేవాడినని అభిప్రాయపడ్డాడు. దానికి కారణం వివరిస్తూ "ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసింది. మా టార్గెట్ ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ అవుతోంది. వాళ్ల స్పందన బాగుంది" అని చెప్పాడు.
సాధారణంగా తమ సినిమాలకు తక్కువ రేటింగ్స్ వస్తే కొందరు దర్శకులు అప్సెట్ అవుతారు. అప్పుడు వారు విమర్శకులపై.. రివ్యూ రైటర్లపై విరుచుకుపడడం కామన్. ఇప్పటికే పలు సందర్భాలలో కొందరు దర్శకులు రివ్యూ రైటర్లపై తమ ప్రతాపం చూపించారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం రేటింగ్స్ పెద్ద విషయమేమీ కాదు అన్నట్టుగా తేల్చాడు. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ఆల్రెడీ ఇద్దరు హీరోలకు కథలు చెప్పానని.. త్వరలోనే వాటిలో ఒకటి ఫైనలైజ్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.