Begin typing your search above and press return to search.
త్వరలో షూటింగ్ ప్రారంభిస్తానంటున్న 'కరోనా వాక్సిన్' డైరెక్టర్!
By: Tupaki Desk | 2 July 2020 4:00 PM GMTటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ సినిమా ‘అ!’ తోనే విమర్శకుల మెప్పు పొందాడు. ఆ సినిమాలో సరికొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చాడు. ఇక తన రెండో ప్రయత్నంగా యాంగ్రీమ్యాన్ రాజశేఖర్‌తో ‘కల్కి’ చిత్రం తెరకెక్కించాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు తన మూడో సినిమా సిద్ధం చేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ఇదివరకే ప్రకటించాడు. అప్పుడే ప్రశాంత్ వర్మ విడుదల చేసిన ప్రీ లుక్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ పోస్టర్ పై కరోనా వ్యాక్సిన్ అని రాసి ఉంది. ఇంజక్షన్ సిరంజిలో 10 శాతం లోడ్ చేశారు. తన తొలి రెండు సినిమాల్లోనూ వినూత్నమైన కాన్సెప్ట్‌లు ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. ఈ మూడో చిత్రంలో కూడా ఏదో కొత్తదనం చూపించబోతున్నారని అర్థమవుతోంది.
ప్రశాంత్ తన తొలి రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆ సినిమాల క్లైమాక్స్ సన్నివేశాలు రిఫ్లెక్ట్ అయ్యేలా రూపొందించాడు. మూడో చిత్రం ఫస్ట్ లుక్ విషయంలోనూ అదే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా భయంతో వణికిపోతోంది. అయితే ప్రశాంత్ కరోనా వైరస్ పైనే సినిమా ప్లాన్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రశాంత్ ఈ మహమ్మారి ఇండియాకి రాకముందే దాని పై పరిశోధన మొదలుపెట్టాడట. నిజానికి లాక్ డౌన్ ముందే ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టానని.. కానీ మూడు నెలలు షూటింగ్స్ నిలిచిపోవడంతో బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. తన సినిమా కాస్ట్ అండ్ క్రూ.. అందరికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారట. పూర్తిగా టీమ్ అంత కరోనా ఫ్రీ అని తెలిసాక షూటింగ్ ప్రారంభం చేయనున్నట్లు ప్రశాంత్ తెలిపాడు.