Begin typing your search above and press return to search.
తెలుగులో తొలి ఒరిజినల్ సూపర్ హీరో ఫిల్మ్ `హను-మాన్`
By: Tupaki Desk | 29 May 2021 3:54 AM GMTచేసే ప్రతి ప్రయత్నం కొత్తగా వినూత్నంగా ఉండాలని ప్రయత్నించే దర్శకులు మనకు ఉన్నారు. ఇదే కోవకు చెందుతారు యువతరం దర్శకుడు ప్రశాంత్ వర్మ. అతడు తెరకెక్కించిన మూడు సినిమాలు వేటికవే ప్రత్యేకం. అ! .. కల్కి .. జాంబీరెడ్డి .. ఈ మూడు చిత్రాలు మూడు విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కినవే. కల్కి ఆశించినంత పెద్ద విజయం సాధించకపోయినా మిగతా సినిమాలు చక్కని సక్సెస్ ని అందించాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ పరంగా వైవిధ్యం తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించింది.
ఇంతకుముందు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబి రెడ్డి తెలుగులో తొలి జాంబీ మూవీ. జనాదరణ దక్కించుకుంది. ఇప్పుడు కూడా మరో ప్రయోగం చేస్తున్నారు. తదుపరి అతడి నుంచి రాబోతున్న పీవీ4 టైటిల్ ని ప్రకటించారు. `హను-మాన్` అనేది టైటిల్. తెలుగులో ఇదే మొట్టమొదటి ఒరిజినల్ సూపర్ హీరో తెలుగు ఫిలిం అని ప్రశాంత్ వర్మ టీమ్ ప్రకటించింది.
నేడు(29మే) ప్రశాంత్ వర్మ పుట్టినరోజున సందర్భంగా సూపర్ హీరోల సినీ విశ్వాన్ని ప్రకటించారు. `హను-మ్యాన్` పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం నిజానికి వాస్తవిక భారతీయ సూపర్ హీరో చిత్రం. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలు.. సూపర్ హీరో తరహా ఎలివేషన్స్ తో ఈ చిత్రం ఆకట్టుకోనుంది. హను-మాన్ భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందిన కథతో రూపొందనుంది. హనుమాన్ భారతీయులకు సూపర్ హీరో ఫిగర్. టైటిల్ లోగోలో సూర్యుడు హను మరియు మాన్ మధ్య ఉదయించాడు. సూర్యునిలో ప్రకాశవంతమైన వజ్రపు కాంతిని చూడొచ్చు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. హిమాలయాల్లో అత్యద్భుతమైన లొకేషన్లను ఈ మోషన్ టీజర్ లో ఆవిష్కరించారు. నేపథ్య సంగీతం దైవిక అనుభూతిని కలిగించింది.
హను-మాన్ క్రొత్త తరహా చిత్రం. భారీగా ఉంటుందని చెబుతున్నారు. కథానాయకుడు సహా ప్రాజెక్ట్ తారాగణం ఇతర సిబ్బంది వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.
ఇక సూపర్ హీరో సినిమాలు దశాబ్ధాలుగా హాలీవుడ్ ను శాసిస్తున్న సంగతి తెలిసిందే. డిసి- మార్వెల్ సూపర్ హీరో సినిమాలు భారీ బాక్సాఫీస్ కలెక్షన్లు సృష్టిస్తున్నాయి. ఇటీవలి ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. వీటన్నిటికీ భిన్నంగా హనుమంతుడి స్ఫూర్తితో ప్రశాంత్ వర్మ తాజా చిత్రాన్ని రూపొందించనుండడం ఆసక్తిని కలిగిస్తోంది.