Begin typing your search above and press return to search.
'అ!' దర్శకుడికి చిక్కిన క్వీన్?
By: Tupaki Desk | 4 May 2018 4:23 AM GMTబాలీవుడ్ కి కంగనా రనౌన్ ను రాణిని చేసిన సినిమా క్వీన్. అప్పటి నుంచి క్వీన్ అనే పేరు ఆమెకు నిక్ నేమ్ అయిపోయింది. అలాంటి చిత్రాన్ని.. సౌత్ లో కూడా రూపొందించేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టుకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సౌత్ లో నాలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని తలపెట్టగా.. తెలుగు వెర్షన్ క్వీన్ గా తమన్నా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం మిల్కీ బ్యూటీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ప్రిపరేషన్స్ పూర్తి చేసుకున్నా.. ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అప్పటికే ఓ చేయి మారిన తర్వాత దర్శకుడు నీలకంఠ చేతికి రాగా.. అతను కూడా తప్పుకున్నాడు. ఇప్పుడీ ముూవీని.. అ! మూవీతో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టినట్లుగా తెలుస్తోంది. విభిన్నమై కథను.. విచిత్రమైన కథనంతో చెప్పి.. అందరి ప్రశంసలు పొందిన ప్రశాంత్ వర్మ.. తను అన్ని జోనర్లను చక్కగా తెరకెక్కించగలనని నిరూపించుకున్నాడు.
ఇప్పుడు మిల్కీ బ్యూటీ ప్రధాన పాత్రలో రూపొందనున్న క్వీన్ తెలుగు వెర్షన్ రీమేక్ కోసం ప్రశాంత్ వర్మకు ప్రపోజల్ పంపడం.. అతను ఒప్పకోవడం కూడా జరిగిపోయాయట. ఇప్పటికే అన్ని రకాలుగా ప్రిపేర్డ్ గా ఉన్న సబ్జెక్ట్ కావడంతో.. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారట. ఒకసారి మొదలుపెడితే.. పూర్తి చేసేవరకూ కంటిన్యూగా షూటింగ్ సాగేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.