Begin typing your search above and press return to search.

'KGF-2' గుట్టు విప్పేసిన ప్ర‌శాంత్ నీల్!

By:  Tupaki Desk   |   8 April 2022 8:52 AM GMT
KGF-2 గుట్టు విప్పేసిన ప్ర‌శాంత్ నీల్!
X
క‌న్న‌డ రాక్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'కేజీఎఫ్‌-2' ఏప్రిల్ 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరి చిత్రంగా ప్రేకుకుల ముందుకొస్తున్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. మ‌రోవైపు టీమ్ పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేస్తోంది.

'కేజీఎఫ్' స‌క్సె స్ ని దృష్టిలో పెట్టుకుని అన్ని మేజ‌ర్ సిటీస్ ని య‌నిట్ ప్ర‌చారంతో క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. 'కేజీఎఫ్ -2' స‌క్సెస్ త‌ర్వాత యశ్-ప్ర‌శాంత్ నీల్ ద్వ‌యం క్రేజ్ మ‌రింత రెట్టింపు అవుతుంద‌ని అంచ‌నాలున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కి ఇంచ్చిన ఇంట‌ర్వ్యూలో య‌శ్ స్టార్ మేక‌ర్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

''ప్ర‌శాంత్ నిజ జీవితంలో ఎలాంటి హ‌డావుడి లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. కానీ అత‌ని ఆలోచ‌న‌ల్ని అంచ‌నా వేయ‌డం..గానీ ప‌ట్టుకోవ‌డంగాని అంత సుల‌భ‌మైన ప‌ని కాదు. భ‌విష్య‌త్ లో ప్ర‌శాంత్ నీల్ చేయ‌బోయే సినిమాల విష‌యంలో అత‌ని థాట్ ప్రాస‌స్ ఎలా ఉంటుంద‌న్న‌ది అత‌నికి మాత్ర‌మే తెలుసు. అత‌నితో పనిచేసినా అత‌న్ని అంత వీజీగా ప‌ట్టుకోలేము. ప్ర‌శాంత్ నీల్ మొద‌టి చిత్రం 'ఉగ్రం' పెద్ద హిట్ అయింది. 'కేజీఎఫ్' చిత్రం చేయ‌డానికి 'ఉగ్రం' ప్రేరేపించింది. 'కేజీఎఫ్-2 ఇంకా పెద్ద హిట్ అయి..భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తే ఇంకా పెద్ద ఆలోచ‌న‌తో ప్ర‌శాంత్ సినిమా చేస్తారుని'' య‌శ్ తెలిపారు.

ప్ర‌శాంత్ నీల్ మాట్లాడుతూ..'' కేజీఎఫ్ -1 కి .. చాప్ట‌ర్ -2కి మధ్య ఉన్న‌ వ్య‌త్యాసం కూడా వివ‌రించారు. మొద‌టి భాగంలో 'కేజీఎఫ్' వ‌ర‌ల్డ్ ని మాత్ర‌మే ప‌రిచ‌యం చేసాం. 'కేజీఎఫ్' ప్ర‌పంచానికి సంబంధించిన స్థాప‌న మాత్ర‌మే జ‌రిగింది. ఇక చాప్ట‌ర్-2 లో 'కేజీఎఫ్' పాత్ర‌లు.. వాటి మాధ్య‌ నాట‌కీయ‌త ఎంత ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌న్న‌ది హైలైట్ అవుతుంది'' అని తెలిపారు.

దీంతో 'కేజీఎఫ్ -2' లో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలే ఉండేట‌ట్లు క‌నిపిస్తుంది. పాత్ర‌లు.వాటి ఎమోష‌న్ పై ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్లు భావించ వ‌చ్చు. మొద‌టి భాగంలో సినిమా ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి ముగిసే వ‌ర‌కూ వ‌రుస‌గా డాన్ లు వ‌స్తూనే ఉంటారు. ఆ పాత్ర‌ల ప‌రిచ‌యానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ -2 లో ఎమోష‌న్..యాక్ష‌న్ హైలైట్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మ‌రో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'స‌లార్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో మ‌రో సినిమా చేయ‌నున్నారు. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -ప్ర‌శాంత్ నీల్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఇంకా సూప‌ర్ స్టార్ మ‌హేష్ లాంటి టాప్ స్టార్లు అత‌నితో సినిమా చేయ‌డానికి ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.