Begin typing your search above and press return to search.
జీవిత - రాజశేఖర్ లతో అదే ఇబ్బంది!!
By: Tupaki Desk | 4 Feb 2019 9:08 AM GMTయాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ సుదీర్ఘ కాలం తర్వాత 'గరుడవేగ' చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్నాడు. క్యారెక్టర్ రోల్స్ - విలన్ పాత్రలకు సిద్దం అనుకుంటున్న సమయంలో గరుడవేగ సక్సెస్ రావడంతో రాజశేఖర్ మళ్లీ హీరోగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'కల్కి' అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నేడు రాజశేఖర్ బర్త్ డే సందర్బంగా నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ... కల్కి చిత్రం కథ నా వద్దకు వచ్చిన తర్వాత దర్శకుడి కోసం చాలా రోజులు వెయిట్ చేశాం. ప్రశాంత్ వర్మ ఎట్టకేలకు మాపై దయ తలచి ఈ సినిమాను చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేను పెద్దగా ఇబ్బంది పడ్డది లేదు. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకు ఏదైతే కావాలో అది నా నుండి రాబడుతున్నాడు. ప్రతి సీన్ ను అద్బుతంగా నటించి నాకు చూపించి దాన్ని చేయించుకుంటున్నాడు. ప్రతి సీన్ కూడా చాలా బాగా తీస్తున్నాడు. ఇక ఈ చిత్రం దర్శకత్వంలో తాను వేలు పెడుతున్నానని, ప్రశాంత్ వర్మను ఇబ్బంది పెడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదు. నేను మరీ అంత చెడ్డ వాడిని కాదు, ప్రశాంత్ ను మేము ఇబ్బంది పెట్టలేదు అన్నాడు.
ఇక ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రాజశేఖర్ గారు సినిమా దర్శకత్వంలో ఇన్వాల్వ్ అయినట్లుగా వచ్చిన వార్తలు నిజం కాదని అన్నారు. రాజశేఖర్ గారి ఫ్యామిలీ అంతా కూడా చాలా స్వీట్. శివానీ మరియు శివాత్మికలతో నేను సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈ చిత్రం సమయంలో నేను పడ్డ ఇబ్బంది ఒకే ఒక్కటి తిండి. అవును తిండి విషయంలో చాలా ఇబ్బంది పడిపోయాను అంటూ ప్రశాంత్ సరదా కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కోసం కొన్ని సార్లు ఏకధాటిగా షూటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయి. ఆ సమయంలో అర్థ రాత్రి రెండు గంటల సమయంలో బోజనం పెట్టి తినాల్సిందే అంటూ ఇబ్బంది పెట్టే వారు. ఈ సినిమా పూర్తి అయ్యేప్పటికి చాలా లావు అవుతానేమో అంటూ ప్రశాంత్ వర్మ సరదాగా కామెంట్ చేశాడు. జీవిత రాజశేఖర్ గార్లతో ఈ విషయంలో తప్ప మరే విషయంలో కూడా ఇబ్బంది లేదని ప్రశాంత్ వర్మ అందరిని నవ్వించాడు.