Begin typing your search above and press return to search.
విడుదల తేదీ ప్రకటించిన ప్రశాంత్ వర్మ.. జాంబిరెడ్డి ఎప్పుడంటే??
By: Tupaki Desk | 12 Jan 2021 5:30 PM GMTటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన ఫస్ట్ సినిమా ‘అ!’ తోనే విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చాడు. ఇక యాంగ్రీమ్యాన్ రాజశేఖర్‌తో ‘కల్కి’ చిత్రం తెరకెక్కించాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం తన మూడో సినిమా జాంబిరెడ్డిని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా వైరస్ నేపథ్యంలో చేస్తున్నట్లు ప్రశాంత్ ఇదివరకే ప్రకటించాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా మంచి బజ్ క్రియేట్ చేసింది. నిజానికి జాంబిరెడ్డి సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేస్తానని తెలిపారు కానీ ప్రస్తుతం సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ ఆఫీసియల్ గా చిత్రయూనిట్ ప్రకటించింది.
అయితే తాజాగా జాంబిరెడ్డి సినిమా వాయిదా పడటానికి గల కారణం ఏంటో కూడా బయటపెట్టాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. 'ఇండస్ట్రీలోని పెద్దవారు మా సినిమాను వాయిదా వేయమని సలహా ఇచ్చారు. అందుకే మేము మా జాంబిరెడ్డి సినిమాని హోల్డ్ లో ఉంచాము. అతిత్వరలో అంటే ఫిబ్రవరి 5న మా జాంబిరెడ్డి మిమ్మల్ని అలరించడానికి థియేటర్లలో విడుదల అవుతోంది. దయచేసి మాస్క్ ధరించి థియేటర్లకు వెళ్ళండి' అంటూ చెప్పుకొచ్చాడు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు కామెడీ మిళితమైన జాంబిరెడ్డి థియేట్రికల్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకేత్తించింది. ఇక ఈ సినిమాను ఆపిల్ ట్రీస్ స్టూడియోస్ నిర్మించగా.. తేజా సజ్జా, ఆనందీ, దక్ష నగర్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. జాంబి కాన్సెప్ట్ పై తెరకెక్కిన ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం.