Begin typing your search above and press return to search.
సైలెంట్ గా నవ్వే రాక్షసులు వీళ్ళు
By: Tupaki Desk | 23 March 2023 1:43 PM GMTసుదీర్ఘకాలం ఎదురుచూపులకు ఫలితం లభించింది. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ ఈరోజు హైదరాబాదులో ఘనంగా జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కాపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ కి పలువురు బడా దర్శకులు కూడా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ మొత్తం మీద ఒక్క ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అదేమిటంటే ఎస్ ఎస్ రాజమౌళి ప్రశాంత్ నీల్ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని నవ్వుకుంటున్న ఫోటో. వీరు ఇద్దరు ఎదురుపడటంతో ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని పలకరించుకున్నారు.
అయితే వీరు సైలెంట్ గా నవ్వే రాక్షసులు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ సినీ చరిత్రలో శంకర్ సినిమాలకు భయపడేవారు. తర్వాత రోజుల్లో రాజమౌళి సినిమాలను కొట్టాలని కసితో అందరూ సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఆయనకు తోడుగా ప్రశాంత్ నీల్ తయారయ్యాడని... వీళ్ళ యాక్షన్ కు పోటీగా సినిమాలు తీయడం ఒక భయంగా మారిపోయింది అని అంటున్నారు. దర్శకులు అందరికీ అలాంటి ఒక తెలియని భయాన్ని సృష్టించిన ఈ దర్శకులు సైలెంట్ గా నవ్వుతూ ఎన్టీఆర్ 30 లాంచ్ లో ఒకరికొకరు ఎదురుపడ్డారని చూస్తే అమాయకంగా ఏమీ తెలియనట్టు ఉంటారు కానీ మహా జాదు గాళ్లు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వీరు ఇప్పుడు చూడడానికి ఇలా కనిపిస్తున్నారు కానీ... ఒకసారి డైరెక్షన్ లోకి ఎక్కితే పని రాక్షసులుగా మారిపోతారని కామెంట్లు చేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎన్టీఆర్ 29వ సినిమా ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి అయితే ఎన్టీఆర్ 31వ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతానికి కొరటాల శివ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన తన 31 వ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశాలున్నాయి.
ఈలోపు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా షూటింగ్ పూర్తి చేయబోతున్నారు. ఇక ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదని ఖచ్చితంగా వరుస హిట్లు పడతాయని ఆయన అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.