Begin typing your search above and press return to search.
'ఆర్.ఆర్.ఆర్' బ్యానర్ లో మూవీ కమిటైన 'కేజీఎఫ్' డైరెక్టర్..?
By: Tupaki Desk | 5 Jun 2021 12:30 PM GMT'కేజీఎఫ్' సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా.. మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసని ప్రూవ్ చేశాడు. హీరోజాన్ని సెంటిమెంట్ ని కలబోసి సినిమాలు తీసే ప్రశాంత్ నీల్.. ఇప్పుడు 'కేజీఎఫ్ చాప్టర్-2' తో సంచలనాలు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు అనౌన్స్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు తెలుగులో మరో స్టార్ హీరోతో సినిమాకి కమిటైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
'ఆర్.ఆర్.ఆర్' వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈరోజు సెన్సేషనల్ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా డీవీవీ సంస్థ స్పెషల్ పోస్టర్ తో విషెస్ తెలపడం ఈ ఊహాగానాలు ఊతమిచ్చింది. ''మా అద్భుతమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నుండి మరిన్ని బ్లాక్ బస్టర్లను చూడటానికి ఎదురుచూస్తున్నాము'' అని డీవీవీ దానయ్య టీమ్ ట్వీట్ చేసింది. దీంతో ఈ సంస్థలో కేజీఎఫ్ దర్శకుడు ఓ సినిమా ఒప్పుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
అంతేకాదు ఈ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లలో ఎవరో ఒకరితో ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. 'భరత్ అనే నేను' సినిమా తీసిన డీవీవీ దానయ్య.. మహేష్ తో మరో సినిమా చేయడానికి అప్పట్లోనే కమిట్మెంట్ తీసుకున్నాడట. అలానే 'వినయ విధేయ రామ' ప్లాప్ తో ఓ సినిమా బాకీ పడిపోయిన చరణ్.. ఫ్యూచర్ లో అదే బ్యానర్ లో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడట. అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరితో డీవీవీ దానయ్య సినిమా నిర్మిస్తారని అంటున్నారు. ఇందులో నిజమెంతో కాలమే సమాధానం చెబుతుంది.