Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో #NTR31 స‌మ‌ర‌శంఖం.. ఇదే ప్రూఫ్‌!

By:  Tupaki Desk   |   6 May 2022 7:30 AM GMT
కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో #NTR31 స‌మ‌ర‌శంఖం.. ఇదే ప్రూఫ్‌!
X
కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యం సాధించి 1000 కోట్ల క్ల‌బ్ లో చేరింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ టోట‌ల్ సౌత్ గ‌ర్వించ‌ద‌గ్గ స‌న్నివేశ‌మిది. ప్ర‌స్తుతం విజ‌య‌గ‌ర్వంతో ప్ర‌శాంత్ నీల్ మ‌బ్బుల్లో తేల్తున్నాడు. అది అత‌డి ముఖంలో క‌నిపిస్తోంది. అత‌డి క‌ళ్లు ట్యూబ్ లైట్లులాగా వెలుగుతున్నాయి. అంతేకాదు.. ప్ర‌భాస్ -చ‌ర‌ణ్ - తార‌క్- బ‌న్నీ వంటి స్టార్లు ప్ర‌శాంత్ నీల్ కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న‌వారి జాబితాలో ఉన్నారు. అత‌డు కూడా టాలీవుడ్ అగ్ర హీరోలంద‌రిపైనా ఇప్ప‌టికే క‌ర్ఛీఫ్ వేసేశాడ‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

చూస్తుంటే వ‌రుస‌గా ప్ర‌శాంత్ నీల్ నుంచి కేవ‌లం పాన్ ఇండియా సినిమాలు మాత్ర‌మే ఉంటాయి. కేవ‌లం పాన్ ఇండియా స్టార్ల‌తో మాత్ర‌మే అత‌డు ప‌ని చేస్తాడ‌నేది స్ప‌ష్ఠ‌మైంది. ఇప్పుడున్న స‌న్నివేశంలో అత‌డు ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఇలా ఫోటో దిగితే దాన‌ర్థం ఏమిటీ అంటే.. ఇన్నాళ్లుగా వెయిటింగులో ఉన్న‌ #NTR31 స‌మ‌ర‌శంఖం పూరించిన‌ట్టేన‌ని తార‌క్ అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు మైత్రి మూవీ మేక‌ర్స్ ఉవ్విళ్లూరుతోంది.

ఇంత‌కీ ప్ర‌శాంత్ నీల్ ఫ్యామిలీ .. తార‌క్ ఫ్యామిలీతో ఎందుకు క‌లిసిన‌ట్టు? అంటే.. ఇటీవ‌ల ఈ జంటలు పెళ్లి రోజు వేడుక‌ల్ని క‌లిసి జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంలో భార్యామ‌ణుల‌తో క‌లిసి ఇద్దరూ ఇలా ఫోటోలు దిగారు. ఇరు కుటుంబాల న‌డుమ బ‌ల‌మైన అనుబంధానికి ఇది సింబాలిక్. నిజానికి ప్ర‌శాంత్ నీల్ పేరు ఇప్పుడు ఇంత బ‌లంగా వినిపిస్తోంది కానీ.. గ‌త 20 ఏళ్లుగా తారక్ సినిమాల‌కు అభిమానిని అని అత‌డు తెలిపాడు. కొన్నేళ్లుగా అత‌డితో తార‌క్ కి ప‌రిచయం ఉంది. ఆ అనుబంధం ఇప్పుడు మ‌రింత పెరిగింద‌న్న మాట‌. స‌క్సెస్ తో పాటే ప్ర‌శాంత్ నీల్ కి అన్నీ క‌లిసొస్తాయ‌నడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్.

కేజీఎఫ్ 2 బాలీవుడ్ లో 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టింది. ఇందులో రాకింగ్ స్టార్ య‌ష్ తో పాటు బాలీవుడ్ నటీన‌టులు సంజయ్ దత్- రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలోకి విడుద‌లైంది. ప్రభాస్ తో స‌లార్ తెర‌కెక్కించే క్ర‌మంలోనే జూనియర్ ఎన్టీఆర్ #NTR31 ని ప్రకటించారు. నీల్ `సలార్` కోసం ప‌ని చేస్తూనే #NTR31 స్క్రిప్టుపైనా ప‌ని చేస్తున్నాడు.

ఎన్టీఆర్ తో తదుపరి ప్రాజెక్ట్ కి పని చేయడం గురించి ప్ర‌శాంత్ నీల్ ఇంత‌కుముందే ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. సినిమా జానర్ ను బహిర్గతం చేయడం చాలా తొందర పాటు అవుతుంద‌ని అన్నాడు. ``నేను ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. దయచేసి ఆ సినిమా జానర్ గురించి నన్ను అడగవద్దు. ఎందుకంటే దీనికి ఇంకా స‌మ‌యం ఉంది... అని వ్యాఖ్యానించాడు.

గత 15-20 సంవత్సరాలుగా ఎన్టీఆర్ అభిమానిని అని ప్ర‌శాంత్ నీల్ తెలిపాడు. మేము స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించే ముందు 10 నుండి 15 సార్లు మామూలుగా కలుసుకున్నాము. నేను తార‌క్ ని కొంచెం అర్థం చేసుకోవాలనుకున్నాను. నా నటీనటులందరితో ఇది నా ప్రక్రియ. నేను ప్ర‌తి నటుడి వద్దకు స్క్రిప్ట్ తీసుకొని వెళ్లి ఇది బాగుందా అని అడగడానికి ఇష్టపడతాను.

నా నటీనటులతో ముఖ్యంగా లీడ్ స్టార్ల‌తో బంధాన్ని ఏర్పరచుకుని ఆపై స్క్రిప్ట్ పై పని చేయడం నాకు చాలా ఇష్టం. సెట్ ని కలిసి హాయిగా ఉంచడానికి ప్రధాన వ్యక్తి క‌థానాయ‌కుడు. ఎన్టీఆర్ తో ఇది గొప్ప ప్రయాణం. గత రెండేళ్లుగా మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. నేను రాసుకున్న కథ ఆయనకు నచ్చింది. ప్రస్తుతం దాని కోసం పని చేస్తున్నాం. నేను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను`` అని అన్నారు. #NTR31ని మైత్రి మూవీ మేకర్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.