Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ సినిమా: ప్రశాంత్ నీల్ కు ఎంతిస్తున్నారంటే..
By: Tupaki Desk | 25 May 2021 1:30 AM GMTరాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' కోసం దాదాపు మూడేళ్లు కేటాయించి శ్రమించారు ఎన్టీఆర్. దాంతో ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోవటానికి అన్నట్లుగా వరుసగా ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్నారు. తాజాగా 31వ చిత్రాని ప్రశాంత్ నీల్‌తో ఎపుడు మాటలు నడిచినా.. ఎన్టీఆర్ పుట్టినరోజున అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ కు ఎంత ఇస్తున్నారు ఈ సినిమా నిమిత్తం అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం ప్రశాంత్ నీల్ కు భారీగానే ముడుతోందిట. అయితే సుకుమార్, రాజమౌళికన్నా తక్కువే అంటున్నారు. ఆ మొత్తం పది కోట్లు అని చెప్పుకుంటున్నారు. కాకపోతే ప్రశాంత్ నీల్ కు కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న సలార్ కూడా ఆ స్దాయి మొత్తం రెమ్యునేషన్ గా దొరకలేదట. దాంతో ఆయన ఫుల్ హ్యాపీట. ఇక ఎన్టీఆర్ మాత్రం బేరాలు ఆడకుండా డైరక్టర్ కు ఇవ్వమన్నారని, అందుకే ప్రశాంత్ నీల్ అడిగిన మొత్తానికి లాక్ చేసాడంటున్నారు.
ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. కొరటాల శివ ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రాన్ని స్వాతంత్య్రం తర్వాత భారత్- పాకిస్థాన్ విడిపోయిన కాలం నాటి నుంచి ఆ తర్వాత భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ యుద్ధంలో మన భారత యోధులు ఏ విధంగా పోరాటం చేసారనే ఇతివృత్తంతో తెరకెక్కబోతున్నట్టు సమాచారం.