Begin typing your search above and press return to search.
రేపు 'కరోనా వ్యాక్సిన్' ప్రిలిమినరీ టెస్ట్ చేయబోతున్న 'అ!' డైరెక్టర్
By: Tupaki Desk | 28 May 2020 9:30 AMటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'అ!' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్ర పోషించింది. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన 'అ!' సినిమా విమర్శకుల మెప్పు పొందడమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ సినిమా రెండు జాతీయ చలన చిత్ర అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ప్రశాంత్ వర్మ రెండో ప్రయత్నంగా యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ తో 'కల్కి' సినిమా తెరకెక్కించారు. థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు స్టోరీలు వినిపించిన ప్రశాంత్.. ఏవీ వర్కౌట్ కాకపోవడంతో మరో వైవిధ్యమైన కథాంశంతో మూడో సినిమాతో రాబోతున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసాడు ప్రశాంత్ వర్మ. నిన్న ట్విట్టర్ లో తన రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ పోస్ట్ చేసి ''ఫస్ట్ లుక్స్ లో క్లైమాక్స్ ట్విస్ట్ గురించి హింట్ ఇస్తూ వస్తున్నారు. నా నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ ను చూపించడానికి తొందరపడుతున్నాను'' అని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ వర్మ విడుదల చేసిన ప్రీ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. #PV3 CARONA VACCINE పోస్టర్ చూస్తే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఇంజక్షన్ సిరంజిలో 10 శాతం బ్లడ్ లోడ్ చేశారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రిలిమినరీ టెస్ట్ చేయనున్నారని ప్రకటించారు. అంటే రేపు ఉదయం ఫస్ట్ లుక్ రాబోతోందన్న మాట. ఈ సినిమా టైటిల్ ఏంటి.. కరోనా వ్యాక్సినే టైటిలా అనే వివరాలు రేపు తెలియనున్నాయి. తన రెండు సినిమాల్లోనూ డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. మూడో చిత్రంలో కూడా ఏదో కొత్తదనం చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఫస్ట్ సినిమా 'అ!' అనిపించుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో మరోసారి 'అ !' అనిపించుకున్నాడేమో చూడాలి. ఇదిలా ఉండగా ఇప్పటికే కరోనాపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ కూడా కరోనా నేపథ్యంలోనే సినిమా తీయబోతున్నాడు.