Begin typing your search above and press return to search.
బడా నిర్మాతలపై అన్ని ఆరోపణలా!?
By: Tupaki Desk | 20 July 2016 5:20 PM GMTఅల్లు అరవింద్, సురేష్ బాబు.. టాలీవుడ్ కి సంబంధించినంత వరకూ వీరిద్దరూ బడా నిర్మాతల లిస్ట్ లో టాప్ లో ఉంటారు. వీరిద్దరిపై ఆరోపణలు రావడం.. అది కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి వెళ్లిపోతున్న ఛైర్మన్ చేసినవి కావడం గమనించాలి.
నిజానికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఆర్కే గౌడ్ కు మరో ఏడాది పదవీ కాలం ఉంది. 'నేను చిన్న నిర్మాతలకు మద్దతుగా క్యూబ్స్, యూఎఫ్ఓ, పీఎక్స్‌డీలకు వ్యతిరేకంగా 7 నెలల నుంచి పోరాడుతున్నాను. ఇతర రాష్ట్రాల్లో వారానికి 3 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్న కంపెనీలు.. ఇక్కడ మాత్రం 11వేలు వసూలు చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై పట్టుపట్టాను. నేను అడిగినప్పుడల్లా కమిటీ వేస్తామని అంటున్నారు కానీ ఏదీ ఆచరణలోకి రావడంలేదు' అన్నారు ఆర్కే గౌడ్.
'సురేష్ బాబుకు యూఎఫ్‌ఓలో వాటా ఉంది. అల్లు అరవింద్ క్యూబ్స్ లో పెట్టుబడులు పెట్టారు. వారి వ్యాపార ప్రయోజనాల కోసం ఏడాది పదవీకాలం ఉండగానే నన్ను తొలగించారు. నేను-విజేందర్ రెడ్డి కలిసి పోరాడ్డంతో చాలా తెలివిగా ఇప్పుడు విజేందర్ రెడ్డిని ముందుకు తీసుకొచ్చారు' అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరించారు ఆర్కే గౌడ్. మరి అవుట్ గోయింగ్ ఛైర్మన్ ఆరోపణలపై ఆ ఇద్దరు బడా నిర్మాతలు ఎలాంటి సమాధానం ఇస్తారో?