Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డికి ఛాన్సిచ్చే నిర్మాత డ్రాపయ్యాడు
By: Tupaki Desk | 9 April 2018 4:21 AM GMTరెండు రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి చేసిన అర్ధ నగ్న ప్రదర్శన టాలీవుడ్ ను కుదిపేసింది. నేషనల్ మీడియాలో కూడా శ్రీరెడ్డి నిర్వాకం గురించిన వార్తలు వచ్చాయి. తనకు మా సభ్యత్వం ఇవ్వాలంటూ శ్రీరెడ్డి నడిరోడ్డు పైనే బట్టలు విప్పేసిన ఘటన విపరీతమైన సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే ఈమెతో తెగ లైవ్ షోలు నిర్వహిస్తున్న ఛానళ్లు.. ఈ అంశంపై ఆమె వెర్షన్ వినిపించేందుకు కూడా ఓ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి.. ఇదే కార్యక్రమానికి దర్శక నిర్మాత కం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గౌడ్ ను కూడా పిలిచారు.
శ్రీరెడ్డి నిరసన వ్యక్తం చేయడంలో తప్పేమీ లేదు కానీ.. ఆమె ఎంచుకున్న విధానం మాత్రం తప్పని అభిప్రాయపడ్డారు రామకృష్ణ. మా అసోసియేషన్ సభ్యత్వం ఇవ్వడంలో ఆలస్యంపై ప్రశ్నించవచ్చని.. అందుకు వేరే దారులు ఎంచుకుని ఉండాల్సిందని అన్నారాయన. ఇప్పుడు ఆమెతో తాను రెండు సినిమాలు తీయాలని భావించగా.. ఆ అంశంపై కూడా తిరిగి ఆలోచనలో పడాల్సి వచ్చిందని చెప్పారు రామకృష్ణ. శ్రీరెడ్డికి మా సభ్యత్వం ఇవ్వబోమని.. అలాగే ఆమెతో కలిసి నటించే మా సభ్యులపై కూడా చర్యలు ఉంటాయని మా సభ్యులు చెప్పేశారు.
ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి అర్ధం కాని సిట్యుయేషన్ కు చేరుకుంది. చేతిలో ఉన్న అవకాశం కూడా పోగా.. ఇప్పుడు దర్శకుడు తేజ కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారా అనే సందేహాన్ని తానే వెలిబుచ్చింది శ్రీరెడ్డి. అయితే.. రామకృష్ణ వ్యాఖ్యలను ఆమె ఖండించింది. తను చేసిన పని తప్పు కాదని.. తనకు వేరే గత్యంతర మార్గం లభించని పరిస్థితుల్లోనే అలా చేయాల్సి వచ్చిందని అంటోంది శ్రీరెడ్డి.