Begin typing your search above and press return to search.
ప్రతాప రుద్రుడు ఆగిపోలేదు
By: Tupaki Desk | 12 Dec 2016 5:30 PM GMT‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత చిత్రాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెరకెక్కించాడు గుణశేఖర్. అతడి కష్టానికి తగ్గట్లు మంచి ఫలితమే వచ్చింది ఆ సినిమాకు. ఈ సినిమా చివర్లో దీనికి కొనసాగింపుగా ‘పత్రాపు రుద్రుడు’ తీయబోతున్నట్లు ప్రకటించాడు గుణ. ఆ తర్వాత ప్రతాప రుద్రుడి గురించి పరిశోధన చేస్తున్నట్లు కూడా వెల్లడించాడతను. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ‘హిరణ్య కశ్యప’ సినిమాను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. మరి ‘ప్రతాప రుద్రుడు’ సంగతేంటి అని అడిగితే.. ఆ సినిమా ఆగిపోలేదన్నాడు గుణ. ఆ సినిమా కోసం మరింతగా వర్క్ చేయాల్సి ఉందని.. 2018లో ఈ సినిమాను మొదలుపెట్టాలనుకుంటున్నానని.. ఈ లోపు ‘హిరణ్య కశ్యప’ చిత్రాన్ని పూర్తి చేస్తానని వెల్లడించాడు.
ఇక ‘హిరణ్య కశ్యప’ విశేషాల గురించి గుణ చెబుతూ.. ఇది హిరణ్య కశ్యపుడి కోణంలో సాగే భక్త ప్రహ్లాదుడి కథ ఇదని గుణశేఖర్ తెలిపాడు. ‘హిరణ్య కశ్యప’ సినిమాకు ‘ది స్టోరీ ఆఫ్ భక్తప్రహ్లాద’ అనే ఉపశీర్షిక పెట్టబోతున్నట్లు చెప్పాడు. ఇందులోని ప్రధాన పాత్రలో ఓ అగ్ర కథానాయకుడు నటిస్తారని దర్శకుడు గుణశేఖర్ వెల్లడించాడు. ‘‘నాకు భక్త ప్రహ్లాద కథంటే చాలా ఇష్టం. అందులో హిరణ్యకశ్యపుడి పాత్ర నన్ను ఎప్పట్నుంచో వెంటాడుతోంది. భాగవతం చదువుతున్నప్పుడు ఆ పాత్రకి సంబంధించి పలు కీలకమైన విషయాలు తెలిశాయి. ఆ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నా. హిరణ్యకశ్యప పాత్ర కోణంలో భక్తప్రహ్లాద కథని చెప్పే ప్రయత్నమిది. ఇటీవల హీరోలు విలన్ పాత్రలకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాలోనూ హిరణ్యకశ్యప పాత్రలో ఓ అగ్ర కథానాయకుడు నటిస్తారు. అదెవరనేది వచ్చే నెలలో ప్రకటిస్తాం. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తాను’’ అన్నాడు.టిస్తారు. అదెవరనేది వచ్చే నెలలో ప్రకటిస్తాం. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తాను’’ అన్నాడు.