Begin typing your search above and press return to search.
ఆ సినిమాలతో వెంకీమామకు ఇబ్బంది తప్పదా?
By: Tupaki Desk | 17 Dec 2019 1:30 PM GMTదసరా సీజన్ తర్వాత బాక్స్ ఆఫీస్ వెలవెలబోయిన సంగతి తెలిసింది. అయితే రెండు నెలల డల్ సీజన్ తర్వాత వెంకటేష్-నాగచైతన్యల 'వెంకీమామ' బాక్స్ ఆఫీసుకు కళ తీసుకొచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో మౌత్ టాక్.. రివ్యూలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించారు. మొదటివారంలో ఈ సినిమా మంచి కలెక్షన్స్ నమోదు చేసింది. అయితే ఈ సినిమా ఇదే ఊపును కొనసాగించగలదా అనేది చూడాలి.
'వెంకీమామ' కలెక్షన్స్ ట్రెండ్ పరిశీలిస్తే మొదటి వారాంతంలో మంచి వసూళ్లు నమోదు చేసినప్పటికీ సోమవారం మాత్రం డ్రాప్ భారీగానే ఉంది. అదివారం వసూళ్లతో పోలిస్తే సోమవారం వసూళ్లు అరవైశాతం పైగా తగ్గాయని సమాచారం. నిజానికి ఈ వారంలో 'వెంకీమామ' ఎంత అధికంగా వసూలు చేస్తే అంత మంచిది. ఎందుకంటే డిసెంబర్ 20 న కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు మారుతి-సాయి ధరమ్ తేజ్ ల 'ప్రతిరోజూ పండగే'.. నందమూరి బాలకృష్ణ 'రూలర్' సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇవి కాకుండా క్రిస్మస్ పండుగకు రాజ్ తరుణ్ సినిమా 'ఇద్దరి లోకం ఒకటే' కూడా రిలీజ్ అవుతోంది.
వీటిలో 'రూలర్' పై భారీ అంచనాలు లేవు కానీ తేజు సినిమాపై మాత్రం పాజిటివ్ బజ్ ఉంది. తేజు సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ ప్రభావం 'వెంకీమామ' పై పడడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు. 'ఇద్దరి లోకం ఒకటే' యూత్ ను టార్గెట్ చేసిన సినిమా కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే ఇది కూడా 'వెంకీమామ' వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈలెక్కన శుక్రవారంలోపే 'వెంకీమామ' కు కలెక్షన్స్ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కష్టమేనని అంటున్నారు.