Begin typing your search above and press return to search.

పోస్టర్ టాక్: పండగ చూపు రేపే

By:  Tupaki Desk   |   10 Sept 2019 12:53 PM IST
పోస్టర్ టాక్: పండగ చూపు రేపే
X
సుప్రీమ్ తో పాతిక కోట్ల మార్కెట్ ని కెరీర్ మొదట్లోనే అందుకున్న సాయి ధరం తేజ్ కు ఆ తర్వాత వరసబెట్టి పలకరించిన డిజాస్టర్లతో మార్కెట్ బాగా ఎఫెక్ట్ అయ్యింది . ఈ ఏడాది వచ్చిన చిత్రలహరి పర్వాలేదు అనిపించగా ఇంకా గట్టి బ్లాక్ బస్టర్ కోసం తేజు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అందులో భాగంగా వస్తోందే ప్రతి రోజు పండగే. రాశి ఖన్నా హీరొయిన్ గా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫస్ట్ లుక్ రేపు రాత్రి 8 గంటలకు విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా ఓ ప్రీ లుక్ వదిలింది టీం. ఓ పెద్ద వయసు చేతులను తేజు హస్తాలు ఆప్యాయతతో బలంగా ఒడిసిపట్టి ఉండగా వేలు విడవని బంధం అనే క్యాప్షన్ ఆకట్టుకునేలా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రేపు వస్తుంది. సాయి తేజ్ కే కాదు ప్రతి రోజు పండగే హిట్ కావడం మారుతీకి కూడా చాలా అవసరం. లాస్ట్ మూవీ నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు తనకో పెద్ద మాస్ బ్రేక్ ఇస్తుందనుకుంటే అంచనాలు అందుకోలేకపోయింది.

ఈ నేపధ్యంలో స్టార్ హీరోలను డీల్ చేయడంలో మారుతీ తడబడతాడు అనే కామెంట్ ని ఎదురుకోవడానికైనా ప్రతి రోజు పండగే హిట్టు కొట్టాలి. మీడియం బడ్జెట్ సినిమాలతో భారీ హిట్లు కొడుతున్న గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఇది రూపొందుతుందడంతో అభిమానులు దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉన్న ప్రతి రోజు పండగే డేట్ టీజర్ తో పాటు ప్రకటించే ఛాన్స్ ఉంది