Begin typing your search above and press return to search.
మీదిమిదికొచ్చిన ఆకతాయిలు వామ్మోవ్
By: Tupaki Desk | 9 Dec 2019 7:02 AM GMTసుప్రీం హీరో సాయి తేజ్ - రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన ప్రతిరోజు పండగే ఈ నెలలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో చిత్రబృందం పర్యటిస్తోంది. అయితే గుంటూరు ఈవెంట్ మాత్రం రసాబాసగా సాగిందని తెలుస్తోంది. స్టార్లు అంటే అభిమానుల హంగామా ఆషామాషీగా ఉండదని మరోసారి ఇక్కడ ప్రూవైంది.
అసలింతకీ ఏం జరిగింది? అన్నది ఆరాతీస్తే.. గుంటూరు భాస్కర్ థియేటర్ వద్ద విలేకరుల ముందు మాట్లాడేందుకు వచ్చిన సాయి తేజ్ - రాశీ జంటను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ అంతకంతకు తోసుకుంటూ ముందుకొచ్చేశారట. ఓవైపు బౌన్సర్లు తోసుకొస్తున్న వాళ్లను అదుపులో పెట్టేందుకు ప్రయత్నించినా ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఆ గుంపులో ఆకతాయిలు అదే పనిగా అల్లరి చేశారట. దీంతో మీడియా సమావేశం వదిలి ఏకంగా ఆ భవంతి పైకి సాయి తేజ్ - రాశీ బృందం వెళ్లిపోవాల్సి వచ్చిందట.
మైక్ తీసుకుని సాయి తేజ్ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆకతాయిల అల్లరి ఏమాత్రం తగ్గలేదు. గోల గొడవ అసలే తగ్గకపోవడంతో ఈ కార్యక్రమం పూర్తిగా రసాబాస అయ్యిందట. ఈవెంట్లో నిర్వాహకులు.. అభిమానుల మధ్య తోపులాట గడబిడ పీక్స్ కి చేరుకోవడంతో ఎవరినీ అదుపు చేయలేకపోయారట. ఈ కార్యక్రమంలోనే పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అంధ విద్యార్థులకు నటీనటుల చేతులమీదుగా చెక్కుల పంపిణీ చేశారు. అయితే స్టార్ల విజిట్లకు ఇలాంటి తోపులాటలు చాలా సహజం. షాపుల ఓపెనింగులు.. రిబ్బను కటింగుల వేళ కామన్ జనం ఇలానే మీద పడుతుంటారు. ఆ సందర్భాల్లో కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో ఎదురవుతూనే ఉన్నాయి.