Begin typing your search above and press return to search.

ల‌ఘుచిత్రాలు చాలు స‌త్తా చాటాలంటే..!

By:  Tupaki Desk   |   16 May 2021 5:44 AM GMT
ల‌ఘుచిత్రాలు చాలు స‌త్తా చాటాలంటే..!
X
ఈరోజుల్లో సినిమా తీయాల‌న్న ఉత్సాహం ఉంటే అసిస్టెంట్ గా ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రికి వారు ల‌ఘు చిత్రాలు చేసి నిరూపించుకుంటే అవే అవ‌కాశాలు తీసుకొస్తున్నాయి. ఎంచుకున్న క‌థ - కంటెంట్ ప‌రంగా ఎదుటివారికి చెప్పి ఒప్పించే నైపుణ్యం కావాలి. కొన్నిసార్లు క‌ష్టం అయినా కానీ చాలాసార్లు వ‌ర్క‌వుట‌య్యేంత ఫ్లెక్సిబిలిటీ నేటి ట్రెండ్ లో క‌నిపిస్తోంది. వెబ్ సిరీస్ లు వెబ్ సినిమాల‌తో ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశాలు మ‌రింత పెరిగాయి. ఇప్పుడు `సినిమా బండి` చిత్రంతో నెట్ ఫ్లిక్స్ రేంజుకు ఎదిగేసిన ప్ర‌వీణ్ కండ్రేకుల కూడా అలా ల‌ఘు చిత్రాల‌తో పాపుల‌రైన‌వాడే. అతడు ఎవ‌రివ‌ద్దా అసిస్టెంట్ గా చేర‌లేదు. అయితే ఇండ‌స్ట్రీలో ప‌దేళ్లుగా ల‌ఘు చిత్రాలు చేస్తున్నాడు.

దర్శకుడు కావడానికి ప్రవీణ్ 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాడు. కానీ ఏ దర్శకుడి వ‌ద్దా చేరలేదు. ష‌ణ్ముఖ్.. వైవా హర్ష వంటి సహచరులతో లఘు చిత్రాలు చేస్తూ టైమ్ పాస్ చేశాడు. ఆ క్ర‌మంలోనే అతను పాపుల‌ర్ వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్` ద‌ర్శ‌క‌నిర్మాతలు రాజ్ అండ్ డీకే లను సంప్రదించాడు. `సినిమా బండి` స్క్రిప్టును రాజ్ అండ్ డీకే లకు వివరించాను. వారు దీన్ని ఇష్టపడి 40 నిమిషాల లఘు చిత్రం చేయమని అడిగారు. చేసి చూపించాం. వారు దానిని బాగా ఇష్టపడ్డారు. ఇప్పుడు దానినే సినిమాగా నిర్మించారు.. పూర్తి నిడివి గల చలనచిత్రంగా ఆర్జ‌న కోసం ఖర్చు చేశారు. కానీ సృజనాత్మక అంశాలలో వారు ఎప్పుడూ వేలు పెట్ట‌లేదు! అని వెల్లడించారు ప్ర‌వీణ్‌.

30 రోజుల్లో ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో ఈ సినిమాని చిత్రీకరించాం. మేకింగ్ విషయంలో ఎక్క‌డా రాజీపడలేదు. మేము న‌టీనటులు లొకేష‌న్ల‌ కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. కానీ షూట్ చేయడానికి ఉపయోగించిన పరికరాలు ఖరీదైనవి.. ల‌ఘు చిత్రం టీమ్ తోనే మేం పూర్తి నిడివి సినిమా చేయ‌మ‌ని నిర్మాత‌లే అడిగారు.. అని తెలిపారు. ``బాలీవుడ్ నుంచి కాల్స్ వ‌స్తున్నాయి. మ‌ణిర‌త్నం త‌ర‌హాలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయాల‌నుంది..`` అని వెల్ల‌డించారు.