Begin typing your search above and press return to search.
యువదర్శకుడిలో డైలెమా ఎందుకో!
By: Tupaki Desk | 6 Aug 2018 5:46 AM GMTఒక పెద్ద హిట్టిచ్చి ఆ తర్వాత ఏడాది కాలం పాటు ఏ సినిమా లేకుండా వెయిటింగ్ చేయడం అంటే ఏ దర్శకుడికి అయినా అది ఇబ్బందికరమే. కానీ టాలీవుడ్లో ఇలాంటి సన్నివేశం పలువురు యువదర్శకులకు ఎదురైందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు సన్నివేశం అదే. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా అన్న తీరుగా పని చేయడం ప్రవీణ్ కి అలవాటు. తొలి సినిమా ఎల్ బిడబ్ల్యూ నుంచి ఇదే పంథాను అతడు అనుసరిస్తున్నాడు. ఆ తర్వాత `చందమామ కథలు` లాంటి జాతీయ అవార్డు సినిమాని తెరకెక్కించాడు. ఇప్పటికే ఐదు సినిమాలు తీశాడు. యాంగ్రీ హీరో రాజశేఖర్ కి అదిరిపోయే కంబ్యాక్ మూవీని ఇచ్చాడు. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన `పిఎస్ వి గరుడవేగ` చక్కని విజయం అందుకుంది. దర్శకుడిగా ప్రవీణ్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే హిట్టు కొట్టినా ఎందుకనో అతడి నుంచి మరో కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇంతకీ లోపం ఎక్కడ? ప్రవీణ్ కథ ఓకే కాలేదా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి పిఎస్ వి గరుడవేగ తర్వాత దాదాపు ఆర్నెళ్ల పాటు అతడు వేరొక స్క్రిప్టుపై సీరియస్ గా వర్క్ చేశాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ కి కథ వినిపించాడు కానీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రచారమైంది. కారణం ఏదైనా మళ్లీ బిగ్ గ్యాప్.
ఆ క్రమంలోనే ప్రవీణ్ సత్తారు గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి - దేవకట్టా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న `బాహుబలి` వెబ్ సిరీస్ కి ప్రవీణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడట. తొమ్మిది ఎపిసోడ్లుగా తెరకెక్కించే ఈ వెబ్ సిరీస్ కి దేవకట్టా & టీమ్ తో కలిసి ప్రవీణ్ పని చేస్తున్నారట. ఒక పెద్ద హిట్టిచ్చి.. ఇలా వెయిటింగ్ చేయడానికి కారణం తదుపరి ప్రాజెక్ట్ కన్ఫామ్ కాకపోవడమే. ఈ గ్యాప్ లోనే ఇలా కొత్త ఎక్స్ పీరియెన్స్ కోసం ప్రవీణ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడని భావించవచ్చు. ఇకపోతే.. ఉన్నమాటను ముక్కు సూటిగా మాట్లాడే ప్రవీణ్ కి కొందరు నిర్మాతలు ఆఫర్ ఇచ్చేందుకు వెనకాడారన్న ప్రచారం సాగుతోంది. అయితే వీటన్నిటికీ ఒకటే సమాధానం.. కొత్త సినిమాని పట్టాలెక్కించడం. మరి ప్రవీణ్ ఆ పని ఎప్పటికి చేస్తాడో చూడాలి.