Begin typing your search above and press return to search.
బడ్జెట్ వలనే సినిమా ఆగింది
By: Tupaki Desk | 23 May 2018 4:59 AM GMTహీరోగా రాజశేఖర్ కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న టైంలో పి.ఎస్.వి. గరుడవేగ సినిమాతో అతడికి మరిచిపోలేని హిట్ ఇచ్చాడు ప్రవీణ్ సత్తారు. ఆ సినిమా కోసం దాదాపు రూ. 30 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారు. రాజశేఖర్ మార్కెట్ రేంజికి అది చాలా ఎక్కువే. అయినా ప్రవీణ్ సత్తారు స్క్రిప్ట్ పై నమ్మకంతో రాజశేఖర్.. ప్రొడ్యూసర్ అడుగు ముందుకేసి మంచి ఫలితాన్ని అందుకున్నారు.
పి.ఎస్.వి. గరుడవేగ ప్రవీణ్ సత్తారుకు కూడా మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. దీని తరవాత ఎనర్జిటిక్ హీరో రామ్ తో తన సినిమా స్టార్ట్ చేశాడు. రామ్ సొంత ప్రొడక్షన్ హౌన్ అయిన స్రవంతి మూవీస్ బ్యానర్ లోనే ఈ సినిమా తీయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు మొదట్లోనే శుభం కార్డ్ పడిపోయింది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు చెప్పిన బడ్జెట్ గిట్టుబాటు కాదని ప్రొడ్యూసర్ స్రవంతి కిషోర్ వద్దనేశారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. దీనిపై ప్రవీణ్ సత్తారు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు. ఎవరు అనేది చెప్పకపోయినా దాదాపుగా ప్రవీణ్ కూడా ఇదే రీజన్ చెప్పడం విశేషం.
‘‘రామ్ తో సినిమాను మిలటరీ బ్యాక్ గ్రౌండ్ లో ప్లాన్ చేశాను. క్వాలిటీ విషయంలో నేను రాజీ పడను కాబట్టి కాస్త బడ్జెట్ ఎక్కువే అవుతుంది. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందనే నమ్మకం నాకు.. రామ్ కు ఉన్నా పెట్టుబడి పెట్టాల్సిన వారికి కలగలేదు. దాంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నా’’ అంటూ ప్రవీణ్ సత్తారు క్లారిటీ ఇచ్చాడు. తాను అడిగినంత మొత్తం ఇవ్వట్లేదు కాబట్టి సినిమా వదిలేయక తప్పలేదని చెప్పేశాడు. అదీ సంగతి.