Begin typing your search above and press return to search.
ప్రవీణ్ తాంబే ఎవరు? : చరిత్ర మరిచిన విజేత కథ
By: Tupaki Desk | 10 March 2022 8:29 AM GMTచరిత్ర మరుగున దాగిన హీరోలు చాలా మందే వున్నారు. వాళ్లలో కొంత మంది మాత్రమే లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ప్రపంచానికి తెలుస్తున్నారు. కానీ చాలా మంది రియల్ హీరోలు ప్రపంచాన్ని చూడటం లేదు. చరిత్రపుటల్లోనే దాగిపోతున్నారు. అలాంటి హీరోల కథల్ని ఇప్పుడు బియోపక్ లుగా తెరపైకి తీసుకొస్తున్నారు. అలాంటి చరిత్ర మరిచిన ఓ అపరాజితుడి కథే `ప్రవీణ్ తాంబే ఎవరు?`. హిందీలో `కౌన్ ప్రవీణ్ తాంబే` అనే పేరుతో ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ బ్యానర్స్ పై శీతల్ భాటియా, సుదీప్ తివారీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
జైప్రద్ దేశాయ్ ఈ మూవీని డైరెక్ట్ చేసిన ఈ మూవీ డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కాబోతోంది. ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ని గురువారం విడుదల చేశారు. శ్రేయాస్ తల్పడే టైటిల్ పాత్రలో నటించగా అంజలి పాటిల్, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు. ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వాయిస్ లో ట్రైలర్ మొదలైంది. ఈ స్టోరీ చాలా ఏళ్ల క్రితం కలిసిస పని చేసిన ఓ ప్లేయర్ గురించి.. చాలా మంది చాలా చోట్ల నుంచి వచ్చి టెండుల్కర్, లక్ష్మణ్, గంగూళీ, కుంబ్లేల గురించి మాట్లాడే వారు.
అయితే నేను మాత్రం ప్రవీణ్ తాంబే గురించి చెప్పాలనుకున్నాను. అని రాహుల్ ద్రవిడ్ అన్నగానే శ్రేయాస్ తల్పడే రైల్ లో ప్రయాణిస్తున్న దృశ్యాలు మొదలయ్యాయి. తన అన్నయ్య ఇంజనీర్ అయిన ఇంటిని చూసుకుంటున్నాడని, నువ్వు కూడా ఉద్యోగం గురించి ఆలోచించమని తల్లి పోరుపెడుతుంటుంది. కానీ ప్రవీణ్ తాంబేకు ఉద్యోగాలపై కంటే క్రికెట్ అంటేనే ఇష్టం. తనని క్రికెట్ ఆడేలా ప్రోత్సహించే సంస్థలోనే ఉద్యోగం చేస్తానని ప్రవీణ్ ఇంట్లో చెబుతుంటాడు.
చివరికి అందరి ఒత్తిడుల కారణంగా ఫార్మాకంపనీలో ఇంటర్వ్యూకి వెళతాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన అవకాశాన్ని అందిపుచ్చుకుని సెలక్టర్ల దృష్టిలో పడతాడు ప్రవీణ్. అదే సమయంలో కోచ్ ఆశిష్ విద్యార్థి అతనికి అండగా నిలుస్తాడు. స్పిన్ ని కూడా చేయగలవని ప్రోత్సహిస్తాడు. రంజీ సెలెక్షన్ కోసం ఎదురుచూస్తున్న అతని ఆశల్ని ఎవరు ఆవిరి చేశారు.
41 ఏళ్ల వయసులో ప్రవీణ్ తాంబే ఎన్నికైనా చివరికి ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నాడు? .. ఎలా తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకున్నాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథ. శ్రేయాస్ తల్పడే ప్రవీణ్ తాంబే పాత్రలో జీవించిన ఈ మూవీ ఏప్రిల్ 1న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.