Begin typing your search above and press return to search.
కల్కి బిజినెస్ ఇస్మార్ట్ గురూ
By: Tupaki Desk | 20 Jun 2019 5:41 AM GMTఒక్క హిట్టు ఎంత పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుందో చెప్పేందుకు తాజా ఉదాహరణ ఇది. గతంలో తన సినిమాల బిజినెస్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సీనియర్ హీరో రాజశేఖర్ `పీఎస్ వీ గరుడ వేగ` తో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు ఎదురే లేని బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా కల్కి ప్రీరిలీజ్ బిజినెస్ గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి ప్రీరిలీజ్ బిజినెస్ జెట్ స్పీడ్ తో పూర్తయిందని తెలుస్తోంది. ఇదివరకూ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కె.కె రాధామోహన్ చేజిక్కించుకున్నారు. అలాగే హిందీ డబ్బింగ్ .. శాటిలైట్ బిజినెస్ పెద్ద ధరకే వెళ్లిందని ఇదివరకూ వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం.. కల్కి శాటిలైట్.. డిజిటల్ బిజినెస్ పూర్తయిందని తెలుస్తోంది. శాటిలైట్ ని ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ స్టార్ మా చేజిక్కించుకుంటే.. డిజిటల్ రైట్స్ ని అమెజాన్ దక్కించుకుందని తెలుస్తోంది. శాటిలైట్ - డిజిటల్ రూపంలో 6కోట్ల మేర బిజినెస్ పూర్తయిందట. వాస్తవానికి పీఎస్ వీ గరుడ వేగ ప్రీబిజినెస్ విషయంలో ఇంత స్పీడ్ లేనేలేదు. సినిమా రిలీజై హిట్ కొట్టాకే శాటిలైట్ వగైరా బిజినెస్ చేశారు. కానీ ఈసారి కల్కికి ఆ ఇబ్బంది ఎదురు కాలేదు. ఇక కల్కి డీల్స్ ని జీవిత రాజశేఖర్ ఎంతో తెలివిగా హ్యాండిల్ చేశారని ప్రశంసిస్తున్నారంతా.
పీఎస్ వీ గరుడ వేగ సాధించిన సక్సెస్ కల్కికి అన్ని విధాలుగానూ ప్లస్ అయ్యిందని విశ్లేషిస్తున్నారు. కష్టే ఫలి అంటారు! దానికి లక్ కూడా కలిసొస్తే ఇంకేమైనా ఉందా.. ఆ రెండూ జీవిత- రాజశేఖర్ దంపతులకు కలిసొస్తున్నాయి. రాజశేఖర్ కెరీర్ తిరిగి ఫుల్ స్వింగులోకి వచ్చినట్టే. ఇక కల్కి చిత్రంలో మరో `మగాడు`ని చూస్తారని.. రాజశేఖర్ కాప్ స్టోరి అద్భుతంగా ఉంటుందని ప్రచారమవుతోంది. దీంతో అభిమానులతో పాటు కామన్ జనాల్లోనూ కల్కిపై విపరీతమైన హైప్ నెలకొంది. ఆ అంచనాల్ని చేరేలా ఆ! ఫేం ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దారా లేదా? అన్నది చూడాలి. ఈనెల 28న కల్కి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. బిజినెస్ గుడ్.. నిర్మాతలు సేఫ్.. మరి ఆశించిన హిట్టొస్తుందా లేదా అన్నది చూడాలి.