Begin typing your search above and press return to search.
ప్రీరిలీజ్ స్టంట్: మహేష్ వర్సెస్ బన్ని?
By: Tupaki Desk | 4 Dec 2019 6:27 AM GMTసంక్రాంతి పందెం లో 400-500 కోట్ల మేర బెట్టింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనంతగా 2020 సంక్రాంతి హీటెక్కి పోతోంది. ఈ సీజన్ లో అరడజను సినిమాలు క్యూ కడుతుండడంతో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రజనీ.. కళ్యాణ్ రామ్ సినిమాలు వస్తున్నా.. ముఖ్యంగా మహేష్- అల్లు అర్జున్ మధ్యనే సిసలైన పోటీ. మెగా- ఘట్టమనేని వార్ గా దీనిని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల వైకుంఠపురములో- సరిలేరు నీకెవ్వరు చిత్రాల పబ్లిసిటీ స్టంట్ లో పోటీతత్వం స్పష్టంగానే కనిపిస్తోంది.
ఇక ఈ వార్ లో భాగంగా ఇప్పటికే దసరా దీపావళి సహా ప్రతి ఈవెంట్ ని ఇరు టీమ్ లో ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రమోషన్ చేసుకున్నాయి. ప్రస్తుతం టీజర్లు.. లిరికల్ వీడియోలు అంటూ ఠగ్ ఆఫ్ వార్ తెలిసిందే. ఎవరికి వారు పైచేయి కోసం చేస్తున్న ప్రయత్నం అభిమానుల్లో వేడెక్కిస్తోంది. ఇక టీజర్లు.. ట్రైలర్లు రికార్డులు అంటూ చర్చా అంతే జోరుగా సాగుతోంది.
ఈ పోటీ ఇంతటి తో ఆగేట్టు లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల ప్రీరిలీజ్/ ఆడియో వేడుకల్ని సాహో- సైరా ఈవెంట్ల రేంజు లో ప్లాన్ చేస్తుండడం ఉత్కంఠ పెంచుతోంది. ఎంచుకునే వెన్యూ.. భారీగా అతిధులతో కూంబింగ్.. ఫ్యాన్స్ పంపింగ్ వగైరా వ్యవహారాలన్నీ ఎవరికి వారు ఎక్స్ క్లూజివ్ గా యూనిక్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అనీల్ రావిపూడి- దిల్ రాజు బృందం ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సరిలేరు ప్రీరిలీజ్ వేడుకకు ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.
మహర్షి ప్రీరిలీజ్ వేదిక పై రిపీటైన స్నేహసుహృద్భావ వాతావరణం తేవడం ద్వారా నందమూరి- ఘట్టమనేని ఫ్యాన్స్ అలయెన్స్ తో బ్లాక్ బస్టర్ సాధించాలన్న ప్లాన్ వేస్తున్నారట. అందుకే జనవరి తొలివారంలో జరిగే ప్రీరిలీజ్ వేదికపై తారక్ తళుక్కుమనే ఛాన్సుందని చెబుతున్నారు. ఇక ఎలానూ అల్లు అర్జున్ కి మెగా- అల్లు ఫ్యాన్స్ అండదండలు ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకు తగ్గట్టే ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లేలా `అల వైకుంఠపురములో` ప్రీరిలీజ్ వేడుకను బన్ని-త్రివిక్రమ్-చినబాబు బృందం ఘనంగానే నిర్వహించే ప్లాన్ లో ఉన్నారట. అయితే అల.. ప్రీరిలీజ్ ఎప్పుడు? బన్ని వేదికపై స్పెషల్ గెస్ట్ గా ఎవరు వస్తారు? అన్నది మాత్రం చిత్రబృందం రివీల్ చేయాల్సి ఉంటుంది.