Begin typing your search above and press return to search.
పవన్ హీరోయిన్ స్ట్రీట్ ఫైట్
By: Tupaki Desk | 7 Sep 2018 12:46 PM GMTనీళ్ల కులాయి దగ్గర అమ్మణ్ణుల కొట్లాటలు... పిల్లలు ఆటల్లో తన్నుకుని రావడాలతో గొడవలు రెగ్యులర్ గా చూస్తుంటాం. ఫిలింనగర్ మురికివాడలో అయినా - ఆకాశహార్మ్యాలు కొలువు దీరే రిచ్ సెలబ్రిటీ అపార్ట్ మెంట్స్ లో అయినా ఇలాంటి గొడవలు కామనే. కయ్యం ఆడే మనసుండాలే కానీ, పేదోడు - గరీబోడు అన్న విభేధాలే లేవ్. సన్నివేశం డిమాండ్ చేస్తే ఆటోమెటిగ్గా సెలబ్రిటీల్లో గయ్యాలి వ్యవహారాలు బయటపడుతుంటాయి.
ఇదిగో ఈ గొడవ అలాంటిదే. పవన్ సరసన `తమ్ముడు` చిత్రంలో నటించిన ప్రీతి జింగానియా ముంబై బిజినెస్ మేన్ ప్రవీణ్ దాబాస్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఏడేళ్ల పిల్లాడు ఉన్నాడు. పేరు జయ్ వీర్ దాబాస్. వీడు మహా మొండి. తమ అపార్ట్ మెంట్ లోని స్నేహితులతో కలిసి పక్క అపార్ట్ మెంట్ కి వెళ్లి గొడవ తేవడం - అటుపై అది చినికి చినికి గాలివానవ్వడం - పోలీసులకు ఫిర్యాదు చేయడం వరకూ వెళ్లింది. అసలింతకీ మ్యాటరేంటి? అని అడిగితే... పొరుగున ఉన్న అపార్ట్ మెంట్ లో ఫుట్ బాల్ ఆడుతున్నపుడు జయ్ వీర్ కి నలుగురు పిల్లల్లో ఒకడితో గొడవ అయ్యింది. అవతలివాడు జయ్ వీర్ పొట్టలో పిడిగుద్దులు గుద్దాడు. అంతేకాదు ఆ పిల్లాడి తాత ఆరిఫ్ ఈ గొడవలో తలదూర్చి జయవీర్ ని తిట్టేశాడట. పైగా వాచ్ మ్యాన్ ని పిలిచి వీడిని మెడ పట్టుకుని బయటకు గెంటేయమని చెప్పాడట. అదే స్పాట్‌లో ఉన్న ఐశ్వర్యారాయ్ కజిన్ సీమా వారించాలని చూస్తే మైండ్ యువర్ బిజినెస్ అంటూ వార్నింగ్ ఇచ్చాడట.
పిల్లల కొట్లాట అక్కడితో ఆగలేదు. కొడుకును ఎడాపెడా తన్నేసిన వాడిపై రుసరుసలాడుతూ ప్రీతి జింగానియా ఏకంగా పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. అంతేకాదు తన బిడ్డడిని దూషించిన పెద్దాయన్ని పోలీస్ గడపకు లాగేందుకు ప్రయత్నించిందిట. మావాడు రెండ్రోజుల నుంచి స్కూల్ కి వెళ్లడం లేదు. ఏమీ తినడం లేదంటూ ఏకంగా ముంబై - ఖర్ పోలీస్ కమీషనర్ కే ఫిర్యాదు చేయడంతో దీనిని సామరస్యంగా సెటిల్ చేసేందుకు ప్రయత్నించారట. ప్రస్తుతం సెలబ్రిటీ కంప్లైంట్ కావడంతో పోలీసులు కిందా మీదా పడుతున్నారట. ఎంతయిన పిల్లల తగువుల్లో ఉక్రోషాలు రావడం సహజమే. కయ్యం ఆడడంలో ఎక్స్ పర్టులై ఉంటే వార్ లో ముందు వరుసలో నిలవొచ్చన్నమాట!