Begin typing your search above and press return to search.

పెళ్ల‌యితే చాలు... ప్రెగ్నెంట్ రూమ‌ర్సేనా?

By:  Tupaki Desk   |   16 Feb 2018 8:47 AM GMT
పెళ్ల‌యితే చాలు... ప్రెగ్నెంట్ రూమ‌ర్సేనా?
X
సామ్-చైతూ... ప‌దేళ్ల ప్రేమ‌ను పండించుకుని పెళ్లి పీట‌లెక్కారు. వారిద్ద‌రికీ పెళ్ల‌యి అయిదు నెల‌లు గ‌డిచిందో లేదో... ఆ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంటా? అంటూ రూమ‌ర్స్ మొద‌లైపోయాయి. అస‌లు పెళ్ల‌య్యిందో లేదో ఇలాంటి పుకార్లు ప్రారంభ‌మైపోతాయి. ఇదిగో ఇప్పుడు స‌మంత‌పై ఇవే రూమ‌ర్లు వైర‌ల్ అవుతున్నాయి,

విద్యాబాల‌న్ - బిపాసా బ‌సు వీళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకున్నాక‌... ఇవే పుకార్లు. విద్యా ఏ ఇంట‌ర్య్వూలోనో కాస్త పొట్ట ద‌గ్గ‌ర చీర స‌రిచేసుకుంటూ క‌నిపించిందంటే చాలు... అదిగో విద్యా క‌వ‌ర్ చేస్తోంది అంటే ఆమె ప్రెగ్నెంటా? అని వార్త‌లు మొద‌లైపోతాయి. మొన్న‌టివ‌ర‌కు బిపాసా చుట్టూ కూడా ఇలాంటి పుకార్లే షికారు చేశాయి. ఆమె త‌న‌కు ఇప్ప‌ట్లో పిల్ల‌ల్ని క‌నే ఉద్దేశం లేద‌ని గ‌ట్టిగానే చెప్పింది. ఇప్పుడు స‌మంత దొరికింది మ‌న గాసిప్పు రాయుళ్ల‌కు. అయినా పెళ్లయితే... పిల్ల‌ల్ని క‌న‌డ‌మే ప‌నా? వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్న సామ్ ఇప్ప‌ట్లో పిల్ల‌ల్ని ఎలా కంటుంది? అని కూడా ఆలోచించ‌రు. త్వ‌ర‌లో స‌మంత త‌న భ‌ర్త‌తో క‌లిసి న‌టించేందుకు కూడా సిద్ధ‌మ‌వుతుంది. ఆమె ప్రెగ్నెంట్ అయితే కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకుంటుంది? ఒక‌సారి ఆలోచించాల్సిన విష‌య‌మే క‌దా.

ఒక‌టి కాదు రెండు కాదు... స‌మంత సినిమాలు అర‌డ‌జ‌ను దాకా ఈ ఏడాది విడుద‌ల అవుతున్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుంటే ఇంకా మూడు నాలుగు సినిమాల షూటింగ్ పార్ట్ కూడా మిగిలే ఉంది. ఆ సినిమాల త‌రువాత చేయ‌బోయే సినిమాలు కూడా ఇప్పుడే సైన్ చేసేసింది సామ్‌.