Begin typing your search above and press return to search.

తన పెళ్లిపై స్పందించిన ప్రీతీ!

By:  Tupaki Desk   |   6 March 2016 11:30 AM GMT
తన పెళ్లిపై స్పందించిన ప్రీతీ!
X
గతంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? అంటూ పెళ్లి విషయం ఎత్తిన మీడియాపై మండిపడే ప్రీతిజింతా చివరకు ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది. తన ప్రియుడు జీన్‌ గుడ్ ఇనఫ్ ను లాస్‌ ఏంజిల్స్‌ లో వివాహం చేసుకున్న మాట నిజమేనని ఆమె వెల్లడించింది. మొన్నటివరకు మిస్‌ ప్రీతిగా ఉన్న తాను ఇప్పుడు ‘మిసెస్‌ గుడ్ ఇనఫ్' అయ్యాను.. అంటూ సంతోషంతో మురిసిపోతోంది. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - స్నేహితులు - అభిమానులకు ట్విట్టర్‌ - ఫేసు బుక్ ఖాతాల ద్వారా పేరుపేరునా ధన్యవాదాలు చెప్పింది.

అయితే ఈ వివాహం మీడియాకు తెలియకుండా రహస్యంగా జరుపుకోవడం గమనార్హం. ప్రీతి జింతా క్లోజ్ ఫ్రెండ్స్ సుజానె ఖాన్ - సురిలీ గోయెల్ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి రహస్యంగా చేసుకున్నా రిసెప్షన్ మాత్రం తన హోదాకు తగిన విధంగా గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. పెళ్లి తర్వాత నెల రోజుల పాటు అమెరికాలోనే హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఈ జంట ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. హనీమూన్ ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో బాలీవుడ్ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.